- Telugu News Photo Gallery Cinema photos Did you know that the beautiful actress is a child artist in the movie Raccha?
అందంతో చంపేస్తున్న ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమా ఏదో తెలిస్తే షాక్ అవుతారు!
చీరలో తన అందాలతో మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఇప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేస్తున్న ఈ చిన్నది మెగా హీరో రామ్ చరణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇంతకీ అది ఏ సినిమానో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి మరి !
Updated on: Apr 30, 2025 | 8:30 PM

నీలి రంగు చీరలో అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్న ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ హీరోలో నటించి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే? రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత రచ్చ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గా ఓ బాలుడు నటించగా, తమన్నా స్థానంలో ఓ క్యూట్ గర్ల్ నటిస్తుంది.

ఆ క్యూట్ గర్లే ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ పేరు విశికా కోటా. ఈ అమ్మడు రచ్చ సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి, తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఏందిరా ఈ పంచాయతీ, సగిలేటి కథ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ నటి ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోస్ నెట్టింట్లో షేర్ చేస్తుంది. తాజాగా నీలిరంగు చీరలో ఉన్న అద్భుతమైన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్‌లో ఈ నటి చాలా అందంగా, అచ్చం తెలుగు అమ్మాయిలా బ్యూటిఫుల్‌గా ఉంది.

ఇక విశికా తెలంగాణకు చెందిన అమ్మాయి. ఈ బ్యూటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, పలు సినిమాలతో తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంది.



