- Telugu News Photo Gallery Cinema photos Deepika Padukone left from prabhs movie for allu arjun movie
Deepika Padukone: ఆ పాన్ ఇండియా స్టార్ కోసం.. ప్రభాస్‌కు బై బై చెప్పిన దీపిక పదుకొనే
అల్లు అర్జున్ కోసమే ప్రభాస్ సినిమాను దీపిక పదుకొనే వదిలేసారా..? సందీప్ రెడ్డి వంగతో అసలు గొడవకు కారణం కూడా అదేనా..? ప్రభాస్ కంటే అల్లు అర్జున్ సినిమాకే దీపిక ఎక్కువ ఇంపారెన్స్ ఇచ్చారా..? మొన్నటి వరకు ఇవి కేవలం అనుమానాలు మాత్రమే.. కానీ ఇప్పుడొచ్చిన సాక్ష్యం చూసాక ఇదే నిజమేమో అనిపిస్తుంది. ప్రభాస్, దీపిక, బన్నీ.. అసలు ఈ ముగ్గురి మధ్య కనెక్షన్ ఏంటి..?
Updated on: Jun 12, 2025 | 7:45 PM

అల్లు అర్జున్, ప్రభాస్.. ఇద్దరితో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని ఎవరైనా హీరోయిన్‌ను అడిగితే ఏం చెప్తారు చెప్పండి..? అమ్మో చెప్పడం కష్టమే.. ఇద్దరూ ప్యాన్ ఇండియానే కదా.. డేస్ట్ అడ్జస్ట్ చేస్తాలెండీ ఇద్దరితో నటిస్తా అంటారు.

కానీ దీపికకు మాత్రం ఆ కన్ఫ్యూజన్ లేదు. మరో అనుమానం లేకుండా అల్లు అర్జున్ సినిమానే సెలెక్ట్ చేసుకున్నారీమే. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో దీపిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.. వీడియోను కూడా విడుదల చేసారు మేకర్స్.

ఇందులో సూపర్ ఉమెన్‌గా నటించబోతున్నారు దీపిక. అంతేకాదు ఇందులో ఆమెకు యాక్షన్ సీక్వెన్సులు చాలానే ఉండబోతున్నాయని వీడియోలోనే తెలిసిపోతుంది. స్పిరిట్ కంటే ఇందులోనే తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందనే ఉద్దేశంతోనే అట్లీ సినిమాకు దీపిక ఒటేసినట్లు అర్థమవుతుంది.

అల్లు అర్జున్ సినిమాను ఊహించిన దానికంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ. సైన్స్ ఫిక్షన్ కాదు.. దానికి మించి ఉండబోతుందని అనౌన్స్‌మెంట్ వీడియోలతో అర్థమవుతుంది.

ఇందులో దీపికతో పాటు మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. వాళ్ల వీడియోలు కూడా త్వరలోనే రానున్నాయి. 600 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అట్లీ.




