Prabhas: ముందు చూపు ఉండాలంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..
ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఆ ఒక్క విజయాన్ని యంగ్ రెబల్‌స్టార్‌కి అందించింది సలార్. ఊపిరి పీల్చుకో డార్లింగ్ అంటూ సలార్ ఇచ్చిన గిఫ్ట్ తో రిలాక్స్ మోడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు డార్లింగ్. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి, 2024, 2025 గురించి ఆలోచిస్తున్నారు. ఈ మాత్రం ముందు చూపు ఉండాలి డార్లింగ్ అంటూ అభిమానులు ఏ విషయం గురించి మాట్లాడుతున్నట్టు? నిన్నటిదాకా అదిగో, ఇదిగో అంటూ ఊరించిన ప్రశాంత్ నీల్ సలార్... రిలీజ్ కావడం, 500 కోట్లు కొల్లగొట్టేయడం కళ్లముందే జరిగిపోయింది.
Phani CH |
Updated on: Dec 30, 2023 | 2:01 PM

ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఆ ఒక్క విజయాన్ని యంగ్ రెబల్‌స్టార్‌కి అందించింది సలార్. ఊపిరి పీల్చుకో డార్లింగ్ అంటూ సలార్ ఇచ్చిన గిఫ్ట్ తో రిలాక్స్ మోడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు డార్లింగ్. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి, 2024, 2025 గురించి ఆలోచిస్తున్నారు. ఈ మాత్రం ముందు చూపు ఉండాలి డార్లింగ్ అంటూ అభిమానులు ఏ విషయం గురించి మాట్లాడుతున్నట్టు?

నిన్నటిదాకా అదిగో, ఇదిగో అంటూ ఊరించిన ప్రశాంత్ నీల్ సలార్... రిలీజ్ కావడం, 500 కోట్లు కొల్లగొట్టేయడం కళ్లముందే జరిగిపోయింది. వాట్ నెక్స్ట్ అనే మాటకు తెర తీశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్‌ని సలార్ సక్సెస్‌ని ఆస్వాదించనివ్వండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నా... అంత టైమ్ లేదు, ఏదో ఒకటి చేసేయాలని చర్చలు షురూ చేస్తున్నారు రెబల్ సైన్యం.

ఇప్పుడు కల్కి షూట్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్. మరోవైపు సైమల్ టైనియస్‌గా మారుతి సినిమా షూటింగ్‌కి హాజరవుతారు. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. 2024కీ, 2025కీ కూడా ఈ రెండు రిలీజులు ఉన్నట్టే.

ఎలాగూ సలార్‌కి పార్ట్ 2 ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ ఇయర్ మిడ్‌లోనో, ఎండ్‌లోనో ఆ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఆ సినిమాను 2025లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో. ఆ తర్వాత ఎలాగూ కల్కికి సీక్వెల్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాకనే మిగిలిన ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి డార్లింగ్.

అన్నట్టు... వచ్చే ఏడాది సలార్2 స్టార్ట్ అయినా, కాకపోయినా సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ మాత్రం కచ్చితంగా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లోనే ఉన్నారు సందీప్. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ని మెప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కెప్టెన్. ఇది పక్కా సందీప్ మూవీ అని ఆల్రెడీ హింట్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. యానిమల్ జోష్‌లో ఉన్న సందీప్ స్పిరిట్ కంప్లీట్ అయితేనే... ప్రభాస్ ముందు లైన్లో ఉన్నలోకేష్, రాజమౌళి, సిద్ధార్థ్ ఆనంద్ పేర్లు కాస్త ముందుకు జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం.





























