
అల్లు వారబ్బాయి, టాలీవుడ్ క్రేజీ హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టనున్నాడు.

కొన్ని రోజుల క్రితమే నయనికతో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు అల్లు శిరీష్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని తన ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.

అక్టోబర్ 31న హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్- నయనికల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు, మెగా ఫ్యామిలీలతో పాటు నయనిక కుటుంబ సభ్యులు తరలివచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, ఉపాసన, లావణ్య త్రిపాఠి.. ఇలా మెగా కుటుంబ సభ్యులందరూ అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు.

ఇక నితిన్- షాలినీ దంపతులు కూడా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. అలాగే నిర్మాత ఎస్కేఎన్ కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

అల్లు శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.