- Telugu News Photo Gallery Cinema photos Bollywood makers are following director Rajamouli in terms of promotions
ఆ విషయంలో జక్కన్నను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్న బాలీవుడ్ మేకర్స్!
మేకింగ్ మాత్రమే కాదు... ఆ సినిమాను ఆడియన్స్ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే అంటున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్. ఏదో సినిమా చేసేసి పక్కన పెట్టేయటం కాకుండా... ప్రమోషన్స్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలా అంతా తామే అయి సినిమాలను ముందుకు తీసుకెళుతున్న వారికే భారీ విజయాలు దక్కుతున్నాయి.
Updated on: Jan 18, 2025 | 6:33 PM

సంక్రాంతి బరిలో సూపర్ హిట్ అయిన సినిమాల విషయంలో దర్శకుల కష్టం గట్టిగా కనిపిస్తోంది. మేకింగ్ మాత్రమే కాదు... ప్రమోషన్ విషయంలోనూ టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారు. డే వన్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాధ్యతలు పూర్తిగా మోస్తున్న అనిల్ రావిపూడి, అన్ని తానే అయి సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశారు.

డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కూడా ఆ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశారు. బాలయ్య అందుబాటులో లేకపోవటంతో ప్రమోషన్ బాద్యత కూడా తీసుకున్న బాబీ, వరుస ఇంటర్వ్యూలతో హల్ చల్ చేశారు. బాబీ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు టాలీవుడ్ ఆడియన్స్.

దర్శకుడంటే కేవలం సినిమా మేకింగ్ వరకు మాత్రమే పరిమితం కాదని ఈ జనరేషన్‌కు తెలియజేసిన దర్శకుడు రాజమౌళి. జక్కన్న సినిమా అంటే ముహూర్తం నుంచి సక్సెస్ పార్టీ వరకు అంతా ఆయనే ఉంటారు. ప్రమోషన్స్‌ను కూడా సినిమా మేకింగ్ అంత పక్కాగా ప్లాన్ చేస్తారు. అందుకే దర్శక ధీరుడు అనిపించుకుంటున్నారు రాజమౌళి.

జక్కన్నను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న బాలీవుడ్ మేకర్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రోహిత్ శెట్టి, అయాన్ ముఖర్జీ, రాజ్‌కుమార్ హిరానీ లాంటి దర్శకులు సినిమా ప్రమోషన్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.





























