- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Season 7 Telugu this may be the Contestants list which is viral on social media telugu cinema news
Bigg Boss 7 Telugu: బిగ్బాస్ సీజన్ 7 సందడి.. నెట్టింట కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్..
బుల్లితెరపై బిగ్బాస్ సీజన్ 7 సందడి షూరు కాబోతుంది. ఇప్పటికే ప్రోమో, లోగో రిలీజ్ చేస్తూ మరికొన్ని రోజుల్లో బుల్లితెరపై రియాల్టీ షో ప్రారంభం కాబోతుందని తెలియజేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ షోలో బుల్లితెర కపూల్ అమర్ దీప్, తేజస్విని పాల్గొననున్నారని టాక్.
Updated on: Jul 21, 2023 | 6:57 PM

బుల్లితెరపై బిగ్బాస్ సీజన్ 7 సందడి షూరు కాబోతుంది. ఇప్పటికే ప్రోమో, లోగో రిలీజ్ చేస్తూ మరికొన్ని రోజుల్లో బుల్లితెరపై రియాల్టీ షో ప్రారంభం కాబోతుందని తెలియజేశారు నిర్వాహకులు.

ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ షోలో బుల్లితెర కపూల్ అమర్ దీప్, తేజస్విని పాల్గొననున్నారని టాక్.

అలాగే కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభా శెట్టి సైతం ఈసారి బిగ్బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన శోభా..ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది.

అలాగే బుల్లెట్టు బండి పాటతో ఫేమస్ అయిన్ సింగర్ మోహన భోగరాజు సైతం బిగ్బాస్ 7లో పాల్గొంటున్నారట.

యూట్యూబర్ శ్వేత నాయుడు కూడా ఈసారి బిగ్బాస్ ఇంట్లోకి వెళ్తుందట. ఇప్పటివరకు యూట్యూబ్ లో డాన్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసింది శ్వేత.

వీరే కాకుండా యాంకర్ దీపికా పిల్లి సైతం బిగ్బాస్ 7లో పాల్గోంటుందని టాక్ నడుస్తోంది. డీ డాన్స్ రియాల్టీ షో ద్వారా దీపికా ఫేమస్ అయ్యింది.

అలాగే సోషల్ మీడియా ఫేమ్ దుర్గారావు కపూల్, సింగర్ సాకేత్ బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టనున్నారట.

తాజాగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ బ్యూటీ సైతం బిగ్బాస్ ఇంట్లోకి వస్తోందట. మరీ ఇందులో నిజమేంత వరకు ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.





























