- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 9 Telugu wild Card Entry Ayesha Zeenath, Know About Her Career and Life
Bigg Boss 9 Telugu: హోస్టుకే ముచ్చెమటలు పట్టించే కంటెస్టెంట్.. బిగ్‌బాస్‌లోకి ఆడపులి.. ఎవరీ ఆయేషా.. ?
బిగ్‌బాస్ సీజన్ 9.. వైల్డ్ కార్డ్స్ వచ్చే సమయం ఆసన్నమైంది. ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తోంది. ఫ్లోరా షైనీతోపాటు శ్రీజ సైతం ఎలిమినేట్ అయ్యిందని టాక్. మరోవైపు ఈరోజు సాయంత్రం ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆయేషా జీనత్. ఆమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.
Updated on: Oct 12, 2025 | 12:44 PM

బిగ్‌బాస్ సీజన్ 9.. ఐదోవారం సైతం పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు వైల్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు. సోషల్ మీడియా సెలబ్రెటీలతోపాటు పలువురు సీరియల్ తారలు సైతం హౌస్ లోకి వెళ్లనున్నారు. అయితే ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆయోషా జీనత్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

బిగ్‌బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది ఆయేషా జీనత్. ఇప్పటికే ఆమె తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. అక్కడ తన ఆట తీరుతో కంటెస్టెంట్లకే చుక్కలు చూపించింది. తప్పును నిలదీస్తూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతుంది. ఈ బ్యూటీని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు.

గ్లామర్ తోపాటు గేమ్స్, డిస్కషన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ అదరగొట్టేస్తుందట. ఈ బ్యూటీతో ఆట అంటే ఇక రచ్చే అంటున్నారు నెటిజన్స్. ఆయేషా జీనత్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2017లో తమిళంలో రెడీ స్టడీ పో గేమ్ షో ద్వారా బుల్లితెర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత మాయ అనే సీరియల్ చేసింది. ఉప్పు పులి కారం, తార అనే సినిమాల్లో నటించింది. తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఫస్ట్ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఆయేషా.. ఆ త్రవాత ఊర్వశివో రాక్షసివో సీరియల్ చేసింది.

తెలుగులో సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఆయేషా .. తర్వాత కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే కార్యక్రమంలో పాల్గొంది. 2023లో తమిళ బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. దాదాపు 9 వారాలు వివాదాస్పద వ్యక్తిగా నిలిచింది.




