AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అందాలతో రచ్చలేపుతున్న హీరోయిన్.. అయినా పట్టించుకోని అదృష్టం.. బ్యూటీకి రానీ ఆఫర్స్..

సినీరంగంలో హీరోయిన్ గా సక్సెస్ కావాలంటే అందం, ప్రతిభ మాత్రమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. ఈ విషయంలో చాలా మంది తారలు వెనకబడి ఉంటారు. గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నప్పటికీ ఆఫర్స్ మాత్రం అందుకోరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

Rajitha Chanti
|

Updated on: Oct 12, 2025 | 11:42 AM

Share
ఐశ్వర్య మీనన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయం కలగలసిన ఈ బ్యూటీకి ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీ నిరాశే మిగిల్చింది.

1 / 5
ఈ సినిమా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. తర్వాత కార్తికేయతో భజే వాయువేగం చిత్రంలో నటించింది. ఆ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. దీంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.

2 / 5
చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందం, గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ లుక్స్ లో నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.

3 / 5
తాజాగా ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మోడ్రన్ లుక్స్ లో మరింత అందంగా మెరిసిపోతుంది ఐశ్వర్య. ఈ అమ్మడు తమిళం, మలయాళం చిత్రాల్లో నటించింది. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

4 / 5
తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో జన్మించిన ఐశ్వర్య.. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత దశావళ సినిమాతో కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.

5 / 5