- Telugu News Photo Gallery Cinema photos Bhumika chawla shared her latest beautiful photos on social media
అబ్బో.. ఏం అందాంరా బాబు..! కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉన్న భూమిక
వయసు పెరిగినా తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామల్లో భూమిక చావ్లా ఒకరు. తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉండేది. సుమంత్ హీరోగా నటించిన యువకుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
Updated on: Sep 09, 2025 | 1:24 PM

వయసు పెరిగినా తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామల్లో భూమిక చావ్లా ఒకరు. తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉండేది.

సుమంత్ హీరోగా నటించిన యువకుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అలాగే మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది ఈ భామ.

ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. దాంతో ఈ భామ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

పవన్ కళ్యాణ్ తో ఖుషీ, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. అలాగే సీనియర్ హీరోలతోనూ నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ చిన్నది సహాయక పాత్రల్లో నటిస్తోంది.

తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కీలక పాత్రల్లో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.




