- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of star actress Shriya enjoying with her daughter
కూతురుతో చిల్.. సంతోషంలో స్టార్ బ్యూటీ!
అందాల చిన్నది టాలీవుడ్ స్టార్, సీనియర్ బ్యూటీ శ్రియా తన కూతురుతో చిల్ అవుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ క్యూట్ ఫొటోస్ చూసెయ్యండి.
Updated on: Nov 17, 2025 | 2:30 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రియా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తల్లి అయినా, ఇప్పటికీ తన గ్లామర్‌తో అందరి మనసులు దోచేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

శ్రియా టాలీవుడ్‌లో ఒకప్పుడూ తన హవా చూపించింది. చిరంజీవి నుంచి నాగార్జున, బాలకృష్ణ, ఇలా అందరి సరసన నటించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందుకుంది. తర్వాత వివాహం చేసుకొని, ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైంది.

కరోనా తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించిన ఈ చిన్నది, మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. యంగ్ హీరోలకు తల్లి పాత్రలు పోషిస్తూ, తన నటనతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంటుంది. సెలక్టీవ్ పాత్రలను చేస్తూ, తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది.

ఇక ఈ అమ్మడు సినిమాల కంటే తన ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ముఖ్యంగా ఏ కాస్త సమయం దొరికినా తన కూతురో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో తన కూతురుతో చిల్ అవుతున్న పొటోస్ షేర్ చేసింది.

తాజాగా తన కూతురుతో వెకేషన్‌కి వెళ్లిన ఈ అమ్మడు తనతో ఆడుకుంటూ, చాలా సంతోషంగా ఉన్న ఫొటోలు షేర్ చేసింది, ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.



