దివి ఓ అందాల నిధి.. పోలీస్ డ్రెస్లో ఏంది ఇది!
అందాల ముద్దుగుమ్మ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది. తర్వాత వరసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోలీస్ డ్రెస్ లో కనిపించి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 12, 2025 | 4:09 PM

బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లోకి వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకుంది. తర్వాత వరసగా సినిమా ఆఫర్స్ అందుకుంటూ తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది

ముఖ్యంగా చిరంజీవి సీనిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ చెక్కేసి, అక్కడ ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సన్నీ డియోల్ హీరోగో నటించిన జాట్ మూవీ రీసెంట్ గా రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో దివి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది.

అయితే దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేయండంతో, ఈ మూవీ కి సంబంధించిన సీక్రెట్స్ రివీల్ చేశావు. దివి ఫొటోలతో ఏంటి ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.





























