- Telugu News Photo Gallery Cinema photos Balakrishna's son Mokshagna Teja and Pawan Kalyan's son Akira Nandan to make debut in Telugu film industry soon Telugu Heroes Photos
Mokshagna Teja vs Akira Nandan: వారసులు వచ్చేస్తున్నారు.! మోక్షు – అకీరా వైపే ఫ్యాన్స్ చూపు.
టాలీవుడ్‌లో మరోసారి నెక్ట్స్ జనరేషన్ వారసులకు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటోలు మెగా, నందమూరి అభిమానుల్లో నయా జోష్ నింపుతున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోస్, ఫ్యాన్స్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు అనుకుంటున్నారా..? మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి పవన్ వారసుడు అకీరా ఫోటోస్.
Updated on: Feb 26, 2024 | 1:25 PM

టాలీవుడ్‌లో మరోసారి నెక్ట్స్ జనరేషన్ వారసులకు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటోలు మెగా, నందమూరి అభిమానుల్లో నయా జోష్ నింపుతున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోస్, ఫ్యాన్స్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు అనుకుంటున్నారా..? మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి పవన్ వారసుడు అకీరా ఫోటోస్.

స్టైలిష్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌కు బదులు ట్రెడిషనల్ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ను అకీరా యూజ్ చేస్తున్నాడంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లో కామెంట్, కంటెంట్ ఏదైనా.. ఫాలోవర్స్‌ను ఎట్రాక్ట్ చేసింది మాత్రం అకీరా లుక్సే. లేటెస్ట్ ఫోటో చూశాకా పవన్ వారసుడు లాంఛింగ్‌కు సిద్ధంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే రేణు దేశాయ్ మాత్రం గతంలోనే ఫ్యాన్స్ ఆశలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అకీరా నందన్‌కు నటనపై ఆసక్తి లేదని.. హీరో కావాలని కూడా అనుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్‌తో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్ చేస్తున్నట్లు చెప్పారు రేణు దేశాయ్.

అఖీరా స్క్రిప్ట్స్ కూడా రాస్తున్నాడని.. తన ఫోకస్ అంతా క్రియేటివ్ జాబ్ వైపు ఉంది గానీ నటుడిగా మారాలని అనుకోవడం లేదని తేల్చేసారు రేణు. అయితే లేటెస్ట్ ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఈ కుర్రాడు పక్కా హీరో మెటీరియల్ అంటున్నారు. అకీరాకు 19 ఏళ్లేగా.. ఇంకా టైమ్ ఉంది వచ్చేస్తాడులే అంటూ సర్దుకుంటున్నారు ఫ్యాన్స్.

అకీరా లాగే అభిమానులను ఊరిస్తున్న మరో స్టార్ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. ఈ కుర్రాడి లేటెస్ట్ లుక్ కూడా ఫ్యాన్స్‌కు కిక్కించింది.

గతంలో మోక్షూ లుక్ విషయంలో చాలా విమర్శలు వినిపించాయి. కానీ ఆ కామెంట్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆరుడగుల అందగాడిగా.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమైపోయారు మోక్షజ్ఞ.

ఈ ఏడాదే వారసుడి తెరంగేట్రం అంటూ బాలయ్య బరోసా కూడా ఇచ్చారు కాబట్టి... గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుతోంది నందమూరి ఆర్మీ.
