దీనికి కారణం కూడా లేకపోలేదు. పుష్ప ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. పైగా సెకండ్ పార్ట్ కచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకం కూడా అందరిలోనూ కనిపిస్తుంది. ఈ నమ్మకంతోనే బడ్జెట్ భారీగా పెరుగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు కూడా వెనకాడట్లేదు. థియెట్రికల్‌తో పాటు డిజిటల్, శాటిలైట్, ఆడియో వగైరా ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లు దాటిపోయేలా కనిపిస్తుంది.