వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో వేద మంత్రాల సాక్షిగా అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతోపాటు.. బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. వీరి వివాహనికి సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇప్పటికే ఒకే ఫ్రేమ్‌లో నూతన వధూవరులతోపాటు.. మెగా, అల్లు హీరోలంతా కలిసి ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, చరణ్ కలిసి చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న ఫోటో చూసి మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.