- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha tweets about her marriage rumours telugu movie news
Trisha Krishnan: పెళ్లి వార్తలపై కౌంటరిచ్చిన హీరోయిన్ త్రిష.. ఒక్క పోస్టుతో తేల్చేసిందా ?..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. రెండు దశాబ్దాలకుపైగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది త్రిష. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో నటనతోనే కాకుండా అందంతోనూ మైమరపించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరోసారి ఆఫర్స్ క్యూ కట్టాయి.
Updated on: Sep 21, 2023 | 8:09 PM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. రెండు దశాబ్దాలకుపైగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది త్రిష. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

తెలుగుతోపాటు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో నటనతోనే కాకుండా అందంతోనూ మైమరపించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరోసారి ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా త్రిష పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీలోని ఓ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై త్రిష స్పందిస్తూ.. డియర్ నువ్వేంటో .. నీటీమ్ ఏంటో నీకు తెలుసు..రూమర్స్ ఆపండి అంటూ పోస్ట్ చేసింది.

గతంలోనూ త్రిష పెళ్లి గురించి రూమార్స్ వచ్చాయి. ఓ సందర్భంలో వాటిపై స్పందిస్తూ అవన్నీ వదంతులంటూ ఖండించింది త్రిష. తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని.. ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్మయించుకుంటే తప్పుకుండా అందరికీ చెప్పేస్తానని తెలిపింది.

ప్రస్తుతం త్రిష లియో చిత్రంలో నటిస్తుంది. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.

పెళ్లి వార్తలపై కౌంటరిచ్చిన హీరోయిన్ త్రిష.. ఒక్క పోస్టుతో తేల్చేసిందా ?..




