- Telugu News Photo Gallery Cinema photos Actress Surekhavani Daughter Supritha Visits Srisailam Mallanna Temple, See Photos
Suprita: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రిత.. చీరకట్టులో ఎంత ట్రెడిషినల్‌గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
నటి సురేఖవాణి కూతురు సుప్రిత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ డెబ్యూమూవీతోనే సుప్రిత కూడా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లిఖార్జునుడిని దర్శనం చేసుకుంది.
Updated on: Jun 04, 2025 | 3:14 PM

టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో హీరోలు, హీరోయిన్లకు హీరోయిన్లకు చెల్లిగా, అక్కగా, వదినగా నటించి మెప్పించింది.

అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు సురేఖా వాణి. అదే సమయంలో ఆమె కూతురు సుప్రిత నాయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న సుప్రిత త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించనుంది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

అందులో చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమా ఒకటి. ఇందులో బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నాడు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇటీవలే గ్లింప్స్ కూడా రిలీజ్ కాగా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు లేచింది మహిళా లోకం, అమరావతికి ఆహ్వానం సినిమాల్లోనూ నటిస్తోందీ అందాలతార.

తాజాగా సుప్రిత శ్రీ శైలం వెళ్లి మళ్లిఖార్జున స్వామిని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల సరదాగా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇందులో చీర కట్టులో ఎంతో అందంగా కనిపించింది సుప్రిత.




