- Telugu News Photo Gallery Cinema photos Actress Meenakshi Chaudhary Intresting Comments About Movie With Vijay Thalapathy
Tollywood: అయ్యో పాపం.. స్టార్ హీరోతో సినిమా చేసి డిప్రెషన్లోకి వెళ్లిపోయిన హీరోయిన్.. రీజన్ ఇదేనట..
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రాణిస్తున్న ఈ వయ్యారి.. ఒకప్పుడు స్టార్ హీరోతో సినిమా చేసింది. కానీ తన మూవీ గురించి ట్రోల్స్ రావడంతో దెబ్బకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.
Updated on: Jun 04, 2025 | 2:11 PM

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారి.. ఒకప్పుడు ట్రోల్స్ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ప్రస్తుతం నెట్టింట ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టింది.

ఇందులో మీనూ పాత్రలో అదరగొట్టేసింది. ఇదిలా ఉంటే.. గతంలో తమిళంలో విజయ్ దళపతి హీరోగా నటించిన గోట్ చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత తనపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారట. ఆ వీడియోస్ చూసి తన చాలా బాధపడ్డానని.. దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లానని తెలిపింది.

ఆ తర్వాత వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా తన మానసిక స్థితిని మార్చిందని.. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తన సినిమాల కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్లు తీసుకుంటున్నట్లు తెలిపింది.




