- Telugu News Photo Gallery Cinema photos Rana venkatesh rana naidu web series release date fix know the details here
Rana Naidu: మాట నిలబెట్టుకున్న వెంకటేష్.. ఈ సారి మరింత జాగ్రత్తగా
టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్‌ను మాత్రం గట్టిగానే డ్యామేజ్ చేసింది. అందుకే సీక్వెల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకీ.. ఈ షోతో వెంకీ మెప్పిస్తారా..? ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Updated on: Jun 04, 2025 | 8:04 PM

ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది.

ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించటం ఏంటి అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్. అయితే ఇన్ని విమర్శల మధ్య సీక్వెల్‌ను పూర్తి చేశారు విక్టరీ హీరో.

విమర్శల విషయంలో గతంలోనే స్పందించిన వెంకీ... తొలి సీజన్ కొంత మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే అన్నారు. అంతేకాదు సెకండ్ సీజన్ ఎక్కువ మంది ప్రేక్షకుల చేరవయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంటే సీజన్ 2లో బోల్డ్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ లేకుండా కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారన్న హింట్ ఇచ్చారన్న మాట.రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ చూస్తే వెంకీ మాట నిలబెట్టుకున్నారనే అనిపిస్తుంది.

తొలి సీజన్‌ను బూతులతో నింపేసిన మేకర్స్, పార్ట్ 2 ట్రైలర్‌లో ఒక్క వల్గర్ వర్డ్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. మరి ఈ షో వెంకీ అభిమానులను సాటిస్‌ఫై చేస్తుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.




