- Telugu News Photo Gallery Cinema photos Nayanthara responds to trolls on chiranjeevi movie promotions know the details here
Nayanthara: ఏది ఎప్పుడు చేయాలో నాకు తెలుసు.. అది నా పర్సనల్.. ట్రోలర్స్ ఇచ్చి పడేసిన ముద్దుగుమ్మ
సినిమాలతో ఎంతగా వార్తల్లో ఉంటారో.. వివాదాలతోనూ అదే స్థాయిలో వార్తల్లో కనిపిస్తుంటారు స్టార్ హీరోయిన్ నయనతార. తాజాగా తనపై వస్తున్న విమర్శల విషయంలో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఇంతకీ నయన్ మీద వస్తున్న విమర్శలేంటి..? ఆ విషయంలో నయన్ రియాక్షన్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: Jun 04, 2025 | 8:20 PM

సినిమాలతో ఎంతగా వార్తల్లో ఉంటారో.. వివాదాలతోనూ అదే స్థాయిలో వార్తల్లో కనిపిస్తుంటారు స్టార్ హీరోయిన్ నయనతార. తాజాగా తనపై వస్తున్న విమర్శల విషయంలో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఇంతకీ నయన్ మీద వస్తున్న విమర్శలేంటి..? ఆ విషయంలో నయన్ రియాక్షన్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం.

ప్రమోషన్స్ విషయంలో నయనతార మీద చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా సరే నయన్ మాత్రం ప్రమోషన్స్‌కు రారు. ఇన్నాళ్లు పరిస్థితి అలాగే కంటిన్యూ అయ్యింది. కానీ రీసెంట్ టైమ్స్‌లో నయన్ కాస్త మారారు. అడపాదడపా ప్రమోషన్స్‌లో కనిపిస్తున్నారు.

తాజాగా మెగా 157లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్, ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఓ ప్రమోషన్ వీడియో చేశారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. తమిళ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనకుండా.. తెలుగు సినిమాకు ముందు నుంచే ప్రమోషన్స్ చేయటం మీద తమిళ జనాలు సీరియస్ అయ్యారు.

నయన్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఈ ట్రోల్స్ మీద సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు నయన్. 'అనవసర విషయాలకి టైమ్ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటా.

ప్రమోషన్లకి వెళ్లాలా?.. వద్దా.. అన్నది నా పర్సనల్ విషయం. దీంట్లో ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అన్నారు. మరి నయన్ చేసిన ఈ కామెంట్స్‌తో ట్రోల్స్‌కు చెక్ పడుతుందా..? లేక వివాదం మరింత ముదురుతుందా చూడాలి.