- Telugu News Photo Gallery Cinema photos Actress Shruti Haasan will Act With Vijay Thalapathy Next Movie Jana Nayagan
Vijay Thalapathy: విజయ్ దళపతి సరసన క్రేజీ హీరోయిన్.. గోల్డెన్ బ్యూటీకి మరో ఛాన్స్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చివరి చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇది 2024లో తమిళ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఇక ఇప్పుడు విజయ్ రాబోయే సినిమాలపై ఆస్తి నెలకొంది. తాజాగా విజయ్ నెక్ట్స్ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Updated on: Feb 09, 2025 | 3:02 PM

విజయ్ చివరి చిత్రానికి దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారని ప్రకటనలు వెలువడ్డాయి. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా విజయ్ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తుంది.

ఆమె మరెవరో కాదు నటి శ్రుతి హాసన్. నటి శ్రుతి హాసన్ ఇప్పటికే నటుడు విజయ్ సరసన పులి చిత్రంలో నటించింది. శింబు దేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె పావల మల్లి పాత్రను పోషించింది.

ఆ తర్వాత ఆమె జన నాయగన్ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పుడు నివేదికలు వెలువడుతున్నాయి. ఇక ఇదే నిజమైతే విజయ్ సరసన శ్రుతిహాసన్ నటించనున్న రెండవ చిత్రం.

ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమతా బైజు, డీజే, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు రెబా మోనికా జాన్ వంటి పలువురు ప్రముఖులు కలిసి నటిస్తున్నారు.

శ్రుతి హాసన్ చివరగా సలార్ చిత్రంలో నటించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రుతి. తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.





























