- Telugu News Photo Gallery Cinema photos Actress Samyuktha menon saree Photos Viral in social media May 2024 Telugu Heroine Photos
Samyuktha Menon: ఏమి ఆ సౌందర్యం.. దేవకన్యలా ముస్తాబయిన సంయుక్త.
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైయ్యింది ఈ వయ్యారి. ఆ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి తనదైన శైలితో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి.
Updated on: May 13, 2024 | 7:37 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైయ్యింది ఈ వయ్యారి.

ఆ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి తనదైన శైలితో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది.

సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ అంటున్నారు.

ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

ఇటీవలే డెవిల్ మూవీతో అలరించింది సంయుక్త. కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది.

సౌత్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నార్త్ లో కాజోల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. మహారాజ్ఞితో నార్త్ ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు ఈ మలయాళ లేడీ.

ఇదిలా అంటే.. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. వైట్ శారీలో యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ సొగసరి.




