- Telugu News Photo Gallery Cinema photos Actress Saanve Megghana latest photos goes viral telugu cinema news
Saanve Megghana: అనుకోకుండానే నటిగా మారి.. వెండితెరపై హీరోయిన్గా అలరిస్తోన్న శాన్వీ.. బ్యూటీఫుల్ ఫోటోస్..
ప్రస్తుతం వెండితెరపై డిజిటల్ ప్లాట్ ఫాంలో హీరోయిన్గా అలరిస్తోంది యంగ్ బ్యూటీ శాన్వీ మేఘన. పుష్పక విమానం సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బీకామ్ చదువుతోన్న రోజుల్లో అనుకోకుండా వచ్చిన ఓ అవకాశం.. ఆమెను నటిగా మార్చింది. ఆ తర్వాత వెబ్ దునియాలో సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది.
Updated on: Jul 09, 2023 | 10:35 AM

ప్రస్తుతం వెండితెరపై డిజిటల్ ప్లాట్ ఫాంలో హీరోయిన్గా అలరిస్తోంది యంగ్ బ్యూటీ శాన్వీ మేఘన. పుష్పక విమానం సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

బీకామ్ చదువుతోన్న రోజుల్లో అనుకోకుండా వచ్చిన ఓ అవకాశం.. ఆమెను నటిగా మార్చింది. ఆ తర్వాత వెబ్ దునియాలో సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది.

హైదరాబాద్ కు చెందిన శాన్వీ. ఒకసారి ఆమె చదువుతున్న కాలేజీలో క్యాంపస్ లో ఓ షూటింగ్ జరిగింది. అక్కడ ఆమెను చూసి.. ఒక సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు.

అయితే అప్పుడు తనకు సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేక ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత జయసుధ నిర్మిస్తోన్న టీవీ సీరియల్ కోసం స్వయంగా జయసుధే అడుగుతుంది.

స్వయంగా జయసుధే అడగడంతో కాదనలేకపోయింది. కొద్దిరోజుల్లోనే నటనపై ఆసక్తి, ఇష్టం రెండూ పెరిగాయి. ఇక జయసుధ భర్త నితిన్ మరణించడంతో ఆ సీరియల్ కాస్త ఆగిపోయింది.

ఇక ఆ తర్వాత ఆమె తిరిగి వెళ్లకుండా సినిమాల్లోనే ఉండిపోయింది. ఆఫర్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమాతో తొలిసారి వెండితెరపై కథానాయికగా కనిపించింది.

సైరా నరసింహారెడ్డి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక పుష్పక విమానం సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం ఆమె పలు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే పిట్ట కథలు చిత్రంలో నటించింది.




