- Telugu News Photo Gallery Cinema photos Actress Rashmika Mandanna spotted in barely there shorts at airport, gets trolled
Rashmika Mandanna : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన రష్మిక డ్రెస్.. ట్రోల్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు..
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది
Updated on: Jan 25, 2022 | 2:10 PM

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న.

తెలుగులో రష్మిక కు ఆఫర్లు క్యూ కట్టాయి. ఛలో తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమా సాలిడ్ హిట్ అందుకోవడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ అందాల భామ.

తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది రష్మిక. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దాంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇక రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా .. తమిళ్ , కన్నడ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా డ్రెస్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అమ్మడి డ్రెస్సింగ్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న రష్మిక తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది.

అయితే ఆమె వేసుకున్న టీ-షర్ట్, షార్ట్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మరీ ఓవర్ అంటూ.. ఈమెకు చలిగా లేదా అని.. కొందరు కామెంట్ చేస్తున్నారు.




