- Telugu News Photo Gallery Cinema photos Actress Laya Visits Vijayawada Indrakeeladri Temple , See Photos
Actress Laya: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న లయ.. ఫొటోస్ ఇదిగో..
ఇటీవలే 'తమ్ముడు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ లయ. ఇందులో నితిన్ కు అక్కగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ లయ కనిపిస్తోంది. తాజాగా ఆమె విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది.
Updated on: Oct 10, 2025 | 7:26 AM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది. గురువారం (అక్టోబర్ 09) విజయవాడ వచ్చిన ఆమె కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారికి మొక్కులు చెల్లించిన లయ ఆలయ సిబ్బంది, భక్తులతో సరదాగా ఫొటోలు దిగింది.

తన ఇంద్రకీలాద్రి యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమాలో ఝాన్సీ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది లయ. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.

అయితే తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి చేయలేకపోయింది. దీంతో రీఎంట్రీలో లయకు ఆశించిన శుభారంభం దక్కలేదు.

లయ ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది.




