Rajeev Rayala |
Updated on: Mar 30, 2024 | 7:25 PM
చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అనికా సురేంద్రన్. తమిళ్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య హీరోయిన్ గా ఓ సినిమా కూడా చేసింది.
ఈ అమ్మడి వయసు ప్రస్తుతం 19 ఏళ్లు. ఇప్పుడు ఈ చిన్నది గ్లామర్ డాల్ లా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు భారీ లైకులు వస్తున్నాయి.
అనికా సోషల్ మీడియాలో కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి.. తెల్ల చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది అనికా సురేంద్రన్.
అనికా 2007లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2019లో వచ్చిన అజిత్ ‘విశ్వాసం’ సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు అనిక హీరోయిన్ గా మారిపోయింది. 2023లో విడుదలైన 'బుట్ట బొమ్మ' సినిమాలో అనిక హీరోయిన్‌గా కనిపించింది. అలాగే అనిక చాలా సినిమాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తోంది అనికా.