- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun Pushpa 2 Movie Teaser release update for his Birthday on April 08 details here Telugu Heroes Photos
Allu Arjun – Pushpa 2: పుష్ప-2 రిలీజ్ డేట్‌పై నో కన్ఫ్యూజన్.! బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.
ఏప్రిల్ వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెల రోజులు తీసుకున్నా.. జూన్, జులై అంతా ప్రమోషన్స్ కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ అండ్ టీం. బాలీవుడ్‌లోనూ పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. అందుకే నార్త్‌పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ఎప్రిల్ 8న బన్నీ బర్త్ డే కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల కానుంది. 5 రోజుల వీకెండ్ ఉండటంతో భారీ కలెక్షన్లపై కన్నేసారు పుష్ప.
Updated on: Mar 30, 2024 | 8:45 PM

ఓ ప్లానింగ్.. ఓ విజన్.. ఓ క్లారిటీ.. ఎలా ఉన్నారో చూడు..! సీతమ్మ వాకిట్లో సినిమాలో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సుకుమార్‌కు బాగా సెట్ అవుతుంది. పుష్ప 2కు ఈయన ప్లానింగ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు.. కంగారు పడట్లేదు లెక్కల మాస్టారు.

రిలీజ్ డేట్ విషయంలోనూ తన ప్లానింగ్స్ తనకున్నాయంటున్నారు. మరి అవేంటో చూద్దామా..? సుకుమార్ ఫోకస్ అంతా పుష్ప 2పైనే ఉంది. ఈ చిత్రంతో తను కూడా 1000 కోట్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు.

అందుకే మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకి కూడా తావివ్వకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. చెప్పినట్లుగానే ఆగస్ట్ 15న పుష్ప 2ను విడుదల చేసి తీరుతామంటున్నారు మేకర్స్.

రిలీజ్ డేట్ మారిందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని తేల్చేసింది చిత్రయూనిట్. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15ని మిస్ చేసేదే లేదంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు.

5 రోజుల వీకెండ్ ఉండటంతో భారీ కలెక్షన్లపై కన్నేసారు పుష్ప. ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్‌లోనే పుష్ప 2ను విడుదల చేసేవాళ్లు కానీ ఆలస్యమైనా.. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే రావాలని చూస్తున్నారు.

5 రోజుల వీకెండ్ ఉండటంతో భారీ కలెక్షన్లపై కన్నేసారు పుష్ప. ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్‌లోనే పుష్ప 2ను విడుదల చేసేవాళ్లు కానీ ఆలస్యమైనా.. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే రావాలని చూస్తున్నారు.

బాలీవుడ్‌లోనూ పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. అందుకే నార్త్‌పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ఎప్రిల్ 8న బన్నీ బర్త్ డే కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల కానుంది.




