Rajeev Rayala |
Updated on: Oct 25, 2024 | 8:11 PM
స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ అమల పాల్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. లవ్ ఫెల్యూర్ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. అంతకు ముందు ప్రేమ ఖైదీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ మలయాళంలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటడ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ అమ్మడు కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు ఎల్ విజయ్ ను పెళ్లాడింది. ఆతర్వాత కొన్నాళ్లకే అతని నుంచి విడిపోయింది.
ఆతర్వాత తిరిగి సినిమాల్లో బిజీగా అయిన ఈ ముద్దుగుమ్మ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత అమల పాల్ సినిమాలు తగ్గించింది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫోటోలు షేర్ చేస్తుంది.
తాజాగా మరోసారి తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు కొన్ని బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది. పెళ్ళైనా.. తల్లైనా కూడా తగ్గేదే లే అంటూ అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి.