- Telugu News Photo Gallery Cinema photos Actor Sree Vishnu Daughter Mridha Half Saree Function Photos Goes Viral
Sree Vishnu: హీరో శ్రీవిష్ణు కూతురిని చూశారా.. ? ఎంత క్యూట్ గా ఉందో.. ఫోటోస్ వైరల్..
తెలుగు సినిమా ప్రపంచంలో విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సరికొత్త కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ సినీప్రియులను అలరిస్తున్నారు. తాజాగా ఈహీరో ఫ్యామిలీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా శ్రీవిష్ణు కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
Updated on: Nov 05, 2025 | 1:28 PM

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా నిత్యం వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సామజవరగమన సినిమాతో కెరీర్ లో మొదటి సారి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు.

ఆ తర్వాత ఓం భూమ్ బుష్ సినిమాతో మరో హిట్టు అందుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇటీవల తన కూతురు హాఫ్ సారీ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. శ్రీవిష్ణు కూతురిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. తమ హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీవిష్ణు భార్య పేరు ప్రశాంతి. కూతురు మిద్రా. తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చివరగా సింగిల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు శ్రీవిష్ణు.

ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. రెగ్యులర్ స్టోరీస్ కాకుండా సరికొత్త కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు శ్రీవిష్ణు.




