- Telugu News Photo Gallery Chanakya Niti: These are the secrets about your wife that a husband should not tell others
చాణక్యనీతి : భార్యకు సంబంధించిన ఈ విషయాలు భర్త ఎవ్వరికీ చెప్పకూడదంట!
ఆ చార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన గొప్ప పండితుడు అంతే కాకుండా తత్వవేత్త, రాజగురువు. ఈయన తన జీవిత అనుభవాల ఆధారంగా అనేక విషయాలను నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా తెలియజేయడం జరిగింది. ఆయన రచనలు , సూక్తులు నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చాణక్యుడు ఎన్నో గొప్ప విషయాలను తెలియజేశాడు. భార్య భర్త బంధం గురించి కూడా ఆయన అనేక విషయాలను తెలిపారు. భర్త భార్యకు సంబంధించిన కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోను ఇతరులకు చెప్పకూడదంట. అవి ఏవి అంటే?
Updated on: Jun 22, 2025 | 9:10 PM

చాణక్యుడి గొప్ప ప్రతిభావంతుడైన వ్యక్తి. ఆయన ఎన్నో విషయాలను క్లుప్తంగా తన నీతి శాస్త్రంలో ప్రచురించడం జరిగింది. బంధాలు, బంధుత్వాలు, స్త్రీ, పురుషులు, ఓటమి, విజయం, అనుమానం, బుద్ది,భార్య భర్తల బంధం, స్నేహం, తోబుట్టువులు ఇలా అనేక విషయాలను ఆయన నేటి వారికి తమ రచనల ద్వారా అందించారు. అయితే చాణక్యడు భార్య భర్తల బంధం చాలా గొప్పదని చెబుతూ.. భర్త తన భార్యకు సంబంధించిన కొన్ని విషయాలు ఇతరులకు చెప్పకూడదని సూచించాడు. అవి ఏవి అంటే?

భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. ఏ బంధంలోనైనాసరే గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన ఆ బంధం అక్కడితోనే ముగిసిపోదు. కానీ చిన్ని చిన్న విషయాలకు గొడవపడి ఆ విషయాలను ఇతరులతో చర్చించకూడదు అంటున్నాడు చాణక్యడు. భర్తపై భార్యకు కోపం రావడం సహజం, దానికే గొవ అయ్యిందనే కోపంతో భార్య గురించి ఇతరులకు చెడుగా చెప్పకూడదు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

ఏ భర్త అయినా సరే తన భార్యకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అది ఇతరులకు అస్సలే చెప్పకూడదు అంటున్నాడు చాణక్యుడు. ఇది కొన్ని సార్లు మీ భార్య మనసు నొప్పించవచ్చు. అంతే కాకుండా సమస్యలకు కూడా కారణం కావచ్చు. అందుకే భార్య అనారోగ్య సమస్యల గురించి ఇతరులతో చర్చించకూడదంట.

కొంత మంది భార్యలు నలుగురిలో తమ భార్యను తిడుతుంటారు. అయితే ఎట్టిపరిస్థితిలో తమ భార్యను భర్త అందరి ముందు తిట్టకూడదంట. అంతే కాకుండా మీ భార్యను తక్కువ చేసి మాట్లాడకూడదంట. దీని వలన ఆమె గౌరవం తగ్గడమే కాకుండా ఇది మీ వైవాహిక జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందంట.

భర్త తమ భార్య బలహీనతలను ఇతరులకు ఎప్పుడూ చెప్పకూడదంట. దీని వలన అందరిలో ఆమెను తక్కువ చేసి చూడటం లేదా పలు సందర్భాల్లో ఆమెపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతే కాకుండా భార్య బలహీనతలు అందరికీ తెలిసిపోతాయి. అందువలన ఎట్టి పరిస్థితుల్లోను భార్య బలహీనతల గురించి భర్త ఎక్కడ చర్చించకూడదు అంటున్నాడు చాణక్యుడు.



