AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్లకే ఎముకల్లో సత్తువ లేక కిందపడిపోతున్నారా.. ఈ చిట్కాతో కొండంత బలం మీ సొంతం

ప్రస్తుత ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి వంటి కీళ్ల సంబంధిత సమస్యలు ఆడవారిలో, మగవారిలో అధికంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే వచ్చే ఈ నొప్పులు, ఇప్పుడు యువతలో కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.

Prasanna Yadla
|

Updated on: Oct 31, 2026 | 3:32 PM

Share

1 / 5
ఈ నొప్పులకు ప్రధాన కారణాలలో బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులు ముఖ్యమైనవి. శరీరంలో వాత దోషం పెరగడం, కాల్షియం లోపం, కీళ్ల మధ్య ఉండే జిగురు అరిగిపోవడం, నడుము, మోకాళ్ళ నొప్పులకు దారితీస్తాయి. శరీరంలో వాత దోషం బాగా పెరిగితే, గ్యాస్ ఖాళీ ప్రదేశాల్లో చేరి నొప్పిని కలిగిస్తుంది. దీనివల్ల కూర్చోవడం, నిలబడటం కూడా చాలా కష్టంగా మారుతుంది.

2 / 5
ఆముదం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకప్పుడు ఇంటి చిట్కాలలో ఎక్కువగా వాడే ఆముదాన్ని ఇప్పుడు చాలామంది పక్కకు పెడుతున్నారు. ఇది చర్మ ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు ఆముదాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా, ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది, కడుపుబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. వాత దోషాన్ని తగ్గించడంలో ఆముదం కీలక పాత్ర పోషిస్తుంది.

3 / 5
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆముదం, కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి తాగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విరిగిన ఎముకలను అతుకించే శక్తి కూడా ఆముదం నీటికి ఉందని చెప్పబడింది. నొప్పులను తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే మరొక అద్భుతమైన కషాయం ఇది. కావాల్సిన పదార్థాలు: శొంఠి పొడి – అర స్పూన్, వాము – ఒక స్పూన్,  బిర్యానీ ఆకు – ఒకటి  నీరు – రెండు గ్లాసులు తోసుకోవాలి.  ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని స్టవ్ మీద తక్కువ మంటలో ఉంచాలి. అందులో అర స్పూన్ శొంఠి పొడిని వేయాలి. శొంఠి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలోని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది, గ్యాస్‌ను తగ్గిస్తుంది. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారికి శొంఠి ఎంతో మేలు చేస్తుంది.

4 / 5
తరువాత ఒక స్పూన్ వామును నీటిలో వేయాలి. వాము ఒక అద్భుతమైన ఔషధం. ఇది విష వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎటువంటి శరీర నొప్పులనైనా వాము నీరు తగ్గిస్తుంది. ఎసిడిటీతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. చివరగా ఒక బిర్యానీ ఆకును కూడా కలపాలి. బిర్యానీ ఆకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్ని పదార్థాలను వేసిన తర్వాత, నీటిని ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక గ్లాసులో వడకట్టుకోవాలి. ఇందులో కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. షుగర్ పేషెంట్లు షుగర్ కలుపకుండా తాగడమే మంచిది.ఈ డ్రింక్‌ను ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక పూట తాగాలి. ఉదయం తాగితే పరగడుపున తాగడం ఉత్తమం. టీ తాగినట్లుగా నెమ్మదిగా సేవించాలి. ఈ డ్రింక్ తీసుకున్నంత కాలం ఉప్పు, కారాలు, జంక్ ఫుడ్ తినకూడదు. పదిహేను రోజుల పాటు ఈ డ్రింక్ తీసుకుంటే కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వంటివి తగ్గుతాయి. నొప్పులు లేని వారు కూడా దీన్ని తీసుకోవచ్చు, ఇది ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.

5 / 5
Follow Us