- Telugu News Photo Gallery Business photos Washing Machine, Budget Washing Machines, Washing Machines under 15k, Amazon sale 2023
Washing Machine: వాషింగ్ మిషన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15 వేలలోనే బెస్ట్ డీల్స్..
పండక్కి కొత్త వస్తువు కొనుగోలు చేయాలని మనలో చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఈ పండుగల సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ కామర్స్ సైట్స్ ఎన్నో రకాల ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నిర్వహిస్తున్నాయి. మరి ఈ సేల్‌లో రూ. 15 వేలలోపు లభిస్తోన్న కొన్ని బెస్ట్ వాషింగ్ మిషిన్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 28, 2023 | 10:38 AM

Godrej 6.5 Kg : వాషింగ్ మిషిన్స్‌కు పెట్టింది పేరైన గోద్రెజ్ కంపెనీకి చెందిన 6.5 కేజీల ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషిన్ అసలు ధర రూ. 17,900కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 12,490కే సొంతం చేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్‌తో వచ్చే ఈ వాషింగ్ మిషన్‌పై 10 ఏళ్ల వారంటీ అందిస్తున్నారు.

LG 7 Kg 5 Star: ఎల్జీ కంపెనీకి చెందిన LG 7 Kg 5 Star Inverter TurboDrum Fully Automatic Top Loading Washing Machine వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 27,990కాగా ఏకంగా 39 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 16,990కే సొంతం చేసుకోవచ్చు. 7 కిలోల కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ వాషింగ్ మిషన్‌ను 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ వాషింగ్ మిషన్ 700 ఆర్‌పీఎమ్ హైయర్ స్పిన్ స్పీడ్‌తో పని చేస్తుంది.

Samsung 6.5 kg: తక్కువ బడ్జెట్‌లో వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన 6.5 కిలోల ఈ వాషింగ్ మిషన్‌లో డిజిటల్ ఇన్వర్టర్ మోటర్‌ను అందించారు. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 22,050 కాగా సేల్‌లో భాగంగా 30 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 15,490కే సొంతం చేసుకోవచ్చు.

Samsung 7 kg 5 star, Eco Bubble Technology: ఎకో బబుల్ టెక్నాలజీ, ఇన్వర్టర్ మోటర్, సాఫ్ట్ క్లోజింగ్ డోర్ వంటి అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 22,500కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 17,980కి సొంతం చేసుకోవచ్చు. 7 కిలోల కెపాసిటీతో పనిచేసే ఈ వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. 2 ఏళ్ల మ్యానిఫ్యాక్చరింగ్ వారంటీని అందిస్తున్నారు.

Samsung 7 kg Fully-Automatic Top Load: సామ్‌సంగ్ బ్రాండ్‌కి చెందిన ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 21,000 కాగా, 26 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 15,490కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 7 కిలోల కెసాసిటీతో తీసుకొచ్చిన ఈ వాషింగ్‌పై 2 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు.




