- Telugu News Photo Gallery Business photos TVS Ntorq 150 launched price, powerful engine and features
TVS Scooter: టీవీఎస్ నుంచి సరికొత్త స్కూటర్ విడుదల.. పవర్‌ఫుల్ ఇంజిన్.. ఫీచర్స్ అదుర్స్!
TVS Scooter: భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 అని కంపెనీ తెలిపింది. ఇది అత్యంత వేగంతో కేవలం 6.3 సెకన్లలో 0-60 కి.మీ/గంట అందుకునే సామర్థ్యం ఉంటుందని తెలిపింది. అలాగే ఈ స్కూటర్ లో..
Updated on: Sep 08, 2025 | 6:10 PM

TVS Scooter: భారతదేశంలో ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. స్కూటర్ విభాగం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. టీవీఎస్ మోటార్ 150సీసీ స్కూటర్ విభాగంలో కొత్త ఎంపికగా టీవీఎస్ ఎన్ టార్క్ 150ని విడుదల చేసింది. ఈ స్కూటర్ ఏ శక్తివంతమైన ఇంజిన్‌తో విడుదల చేసింది. దీనిలో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించింది కంపెనీ.

భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 అని కంపెనీ తెలిపింది. ఇది అత్యంత వేగంతో కేవలం 6.3 సెకన్లలో 0-60 కి.మీ/గంట అందుకునే సామర్థ్యం ఉంటుందని తెలిపింది

ఫీచర్లు ఎలా ఉన్నాయి?: TVS N Torq 150 స్కూటర్ అనేక గొప్ప లక్షణాలతో విడుదలైంది. దీనిలో ప్రొజెక్టర్ హెడ్‌లైట్, హజార్డ్ ల్యాంప్, ఫాలో మీ హెడ్‌లైట్, ఫోర్ వే నావిగేషన్ ప్రీమియం స్విచ్, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్, ట్రాక్షన్ కంట్రోల్, ABS, iGo అసిస్ట్, స్ట్రీట్ మరియు రేస్ రైడ్ మోడ్‌లు, డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక లక్షణాలు అందించింది.

శక్తివంతమైన ఇంజిన్: తయారీదారు ఈ స్కూటర్‌కు 149.7 సిసి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 9.7 kW శక్తిని, 14.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌తో స్కూటర్‌ను 6.3 సెకన్లలో 0-60 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు.

ధర ఎంత? : తతయారీదారు ఈ స్కూటర్‌ను భారతదేశంలో రెండు వేరియంట్లలో అందిస్తోంది.TVS NTorq 150, TVS NTorq 150 TFT. దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.19 లక్షలు. అలాగే టీవీఎస్ కొత్త ఎన్‌టార్క్ 150 స్కూటర్‌ను 150సీసీ విభాగంలో విడుదల చేశారు. ఈ విభాగంలో యమహా ఏరోక్స్ 150, అప్రిలియా 150సీసీ స్కూటర్లతో పోటీ పడాల్సి ఉంటుంది. త్వరలో హీరో జూమ్ 160తో కూడా పోటీ పడాల్సి ఉంటుంది.

ఈ ఆవిష్కరణ గురించి టీవీఎస్ మోటర్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ - హెడ్,కమ్యూటర్ అండ ఈవీ బిజినెస్, హెడ్ - కార్పొరేట్ బ్రాండ్ అండ్ మీడియా అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ.. రెండు మిలియన్లకు పైగా NTORQians, 50 స్వీయ-నిర్వహణ రైడ్ గ్రూపులు, కమ్యూనిటీలు భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే, ఐకానిక్ ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటి గా దాని రైడర్ల తో నిర్మించబడిన సంబంధాన్ని నిర్వచిస్తాయని అన్నారు.




