Electric Scooters: రూ. లక్షలోపు బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. లాంచింగ్ ఎప్పుడంటే..

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వీటి వినియోగం అధికమైంది. ట్రాఫిక్ అధికంగా ఉండే సిటీల్లో ఇవి అనువుగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు ఏదైనా కొత్త బండి కొనాలంటే ఎలక్ట్రిక్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని అధికమవుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఓ కారణమే. ఈ నేపథ్యంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్లలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్రాండ్లు మార్కెట్లో తమదైన ముద్ర వేశాయి. అలాగే రానున్న నెలల్లో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచింగ్ సిద్ధమయ్యాయి. వాటిల్లో ఓలా తో పాటు హీరో, యాంపియర్ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో లాంచ్ కానున్న టాప్ ఆరు మోడళ్లను ఇప్పుడు చూద్దాం. వీటి ధరలు కూడా కేవలం రూ. లక్షలోపే ఉంటాయి..

|

Updated on: May 04, 2023 | 4:30 PM

ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air).. సిటీ వినియోగదారులకు ఓలా అందిస్తున్న మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీనిటాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. మోటార్ గరిష్ట శక్తి 4.5 kw ఉంటుంది. దీనిలోని బ్యాటరీ చార్జింగ్ టైం నాలుగున్నర గంటలు. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది.  2kwh వేరియంట్ 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 84,999, 3 kwh బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్కూటర్ 125 కిలోమీటర్ల రేంజ్  ఇస్తుంది. దీని ధర రూ. లక్ష ఉంటుంది. అలాగే  4 kwh వేరియంట్ 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 1.09 లక్షలు ఉంటుంది. దీనిని డెలివరీలు 2023 జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

1 / 6
యాంపియర్ జీల్ ఈఎక్స్(Ampere Zeal Ex).. మంచి పనితీరుకు పేరున్న యాంపియర్ నుంచి రానున్న కొత్త మోడల్ ఇది. దీనిలో 60v, 2.3kwh సామర్థ్యంతో కూడిన అడ్వాన్స్ డ్ లిథియం బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో బ్యాటరీకి మూడేళ్ల వారంటీ ఉంటుంది. దీని ధర రూ.75,000 ఉంటుంది. దీని డెలివరీలు కూడా జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది.

2 / 6
ఎల్ఎంఎల్ స్టార్(LML Star).. క్లాసీ లుక్ లో వస్తోన్న మరో బైక్. దీనిలో 7.5 హార్స్ పవర్, 9.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. సింగిల్ చార్జ్ పై 100 నుంచి 125 కిలోమీటర్లు వెళ్లగలుగుతుంది. దీని ధర రూ. లక్ష ఉంది. దీని లాంచింగ్ సెప్టెంబర్ 2023లో ఉంటుంది.

3 / 6
వెస్పా ఎలట్రికా(Vespa Elettrica).. ఐకానిక్ డిజైన్ లో ఉండే వెస్పా ఎలక్ట్రిక్ వేరియంట్లో కొత్త స్కూటర్ ను తీసుకొస్తోంది. దీనిలో ఏకంగా ఐదు వేరియంట్లు ఉన్నాయి. అన్ని 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 3.6కిలోవాట్ల సామర్థ్యంతో మోటార్ వస్తుంది. బ్యాటరీ చార్జింగ్ టైం 3.5 గంటలు పడుతుంది. దీని ధర రూ. 90,000 ఉంటుంది.

4 / 6
హీరో ఎలక్ట్రిక్ ఏఈ-8(Hero Electric AE-8).. 
హీరో నుంచి వస్తున్న మరో ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్ ఇది. ఇది సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు ఉంటుంది. దీని ధర రూ. 70,000 ఉంటుంది. 2023 చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

హీరో ఎలక్ట్రిక్ ఏఈ-8(Hero Electric AE-8).. హీరో నుంచి వస్తున్న మరో ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్ ఇది. ఇది సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు ఉంటుంది. దీని ధర రూ. 70,000 ఉంటుంది. 2023 చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

5 / 6
ఎవర్వీ ఈఎఫ్1(Everve EF1)..కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారైన ఈ బైక్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. దీనిలో 4.2 కిలోవాట్అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంది. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది 2023 మే చివరికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ. 90,000 ఉంటుంది.

6 / 6
Follow us
Latest Articles