- Telugu News Photo Gallery Business photos PM Kisan: Important Documents Required for 14th Installment
PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 14వ విడత నగదు జమవ్వాలంటే ఈ పత్రాలు ఉండాల్సిందే..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నగదును త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేయనున్నారు. అయితే, పీఎం-కిసాన్ స్కీమ్ నగదు జమ తేదీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే మే నెలాఖరులోగా లేదా జూన్ నెల మొదటి వారంలో పీఎం కిసాన్ 14 విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated on: May 04, 2023 | 1:55 PM

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నగదును త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేయనున్నారు. అయితే, పీఎం-కిసాన్ స్కీమ్ నగదు జమ తేదీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే మే నెలాఖరులోగా లేదా జూన్ నెల మొదటి వారంలో పీఎం కిసాన్ 14 విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అంతకుముందు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం13వ విడత నగదు ఫిబ్రవరి నెలలో విడుదలైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశంలోని అర్హులైన రైతులు.. ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పొన.. మూడు విడతల్లో రూ.6,000లను పొందుతారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ.. eKYC చేయడం తప్పనిసరి.. అయితే, కొత్తగా పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకునే వారు, అంతకుముందు ప్రయోజనం పొంది.. మధ్యలో నిలిచిపోయిన రైతులు ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది..

PM కిసాన్ యోజన 14వ విడత ప్రయోజనాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఏంటంటే..? రైతుల ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా, బ్రాంచ్ వివరాలు, భూహక్కు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను అడిగి సమాచారం పొందవచ్చు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని భర్త, భార్య, పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ పొందవచ్చు. ఒక కుటుంబంలోని లబ్దిదారుల సంఖ్యకు పరిమితి లేదు. వారి పేరు మీద భూమి ఉండాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న రైతులకు మూడు విడతల్లో నగదు అందుతుంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం చిన్న, సన్నకారు రైతులకు సహాయం చేయడానికి కేంద్రం ప్రారంభించింది. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోని జీవనోపాధిని మెరుగుపర్చుకోవచ్చు.