Best Mileage Scooters: మైలేజ్‌ విషయంలో ఈ స్కూటర్లకు నో పోటీ.. రూ.లక్ష లోపు లక్షణమైన స్కూటర్లివే..!

ప్రస్తుతం ప్రతి చిన్న కుటుంబానికి ద్విచక్ర వాహనం అనేది తప్పనిసరైంది. తగ్గుతున్న ప్రజారవాణా సౌకర్యాల నేపథ్యంలో ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనం లేకపోతే పనులు అవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరికీ ఉపయోగపడేలా ఉండే స్కూటర్లు ఎక్కువ ఆదరణ పొందాయి. కాబట్టి కంపెనీలు కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా రూ.లక్ష లోపు బోలెడన్ని మోడల్‌ స్కూటర్లను లాంచ్‌ చేశాయి. తక్కువ ధరకే అత్యధిక మైలేజ్‌ను ఇచ్చేలా వాటిని రూపొందించారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ రూ.లక్ష లోపు అదిరిపోయే మైలేజ్‌ను ఇచ్చే బెస్ట్‌ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 27, 2023 | 7:37 PM

హోండా యాక్టివా 6 జీ స్కూటర్‌ రూ.లక్ష లోపు లభ్యమయ్యే అధునాతన ఫీచర్లతో వచ్చే స్కటర్‌గా చెప్పవచ్చు. 110 సీసీ ఇంజిన్‌తో పని చేసే స్కూటర్‌ 7.7 బీహెచ్‌పీ పవర్‌, 8.4 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ లీటర్‌కు 60 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌ రూ.73,086(ఎక్స్‌-షోరూమ్‌) వద్ద లభ్యం అవుతుంది. అధునాతన ఎల్‌ఈడీ లైట్లతో వచ్చే ఈ స్కూటర్‌ అందరినీ ఆకర్షిస్తుంది.

1 / 5
సుజుకీ కంపెనీ కూడా స్కూటర్ల రంగంలో తన మార్క్‌ను చూపించడానికి యాక్సెస్‌ 125ను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ కూడా 124 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే 8.5 బీహెచ్‌పీ పవర్‌, 10 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి యాక్సెస్‌125 స్కూటర్‌ లీటర్‌కు 64 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. యూఎస్‌బీ పోర్ట్‌తో వచ్చే ఈ స్కూటర్‌ ధర రూ.77,600 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

2 / 5
హోండా యాక్టివాకు పోటీగా టీవీఎస్‌ రిలీజ్‌ చేసిన జూపిటర్‌ స్కూటర్‌ కూడా మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. 124.8 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్‌ 8 బీహెచ్‌పీ పవర్‌, 10.5 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ లీటర్‌కు 50 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌ ధర రూ.82,825 (ఎక్స్‌-షోరూమ్‌) వద్ద లభిస్తుంది.

3 / 5
హోండాకు ఎప్పటికప్పుడు పోటీగా నిలిచే హీరో కంపెనీ కూడా తన యాక్టివా స్కూటర్‌కు పోటీగా మరో స్కూటర్‌ లాంచ్‌ చేసింది. హీరో మ్యాస్టో ఎడ్జ్‌ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ స్కూటర్‌ 124.6 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. 9 బీహెచ్‌పీ పవర్‌, 10.4 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంట్రీ లెవెల్‌ డ్రమ్‌ వేరియంట్‌తో వచ్చే ఈ స్కూటర్‌ ధర రూ.86,256(ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంటే, మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125 కనెక్ట్‌ చేసిన వేరియంట్‌ విషయానికి వస్తే రూ.96,586(ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది.

4 / 5
యమహా కూడా రేయ్‌జెడ్‌ఆర్‌ పేరుతో స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. 125 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్‌ 8.08 బీహెచ్‌పీ పవర్‌తో, 10.3 ఎన్‌ఎం టార్క్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్‌ కూడా లీటర్‌కు 68 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. డ్రమ్‌, డిస్క్‌ బ్రేక్‌ల వేరియంట్‌లతో వచ్చే ఈ స్కూటర్‌ ధరలు వరుసగా రూ.84,730(ఎక్స్‌-షోరూమ్‌), రూ.90,830 (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉన్నాయి.

5 / 5
Follow us