- Telugu News Photo Gallery Business photos Mango Millionaire's 10 30 50 Rule: A Step by Step Savings Plan for Wealth
10-30-50.. అద్భుతమైన పెట్టుబడి ఫార్ములా..! చిన్నగా మొదలుపెట్టి.. భారీగా డబ్బు పొందవచ్చు..
రాధిక గుప్తా రచించిన "మ్యాంగో మిలియనీర్" పుస్తకంలో పొదుపుకు సంబంధించి అద్భుతమైన 10-30-50 ఫార్ములాను పరిచయం చేశారు. ఇరవైలలో 10 శాతం, ముప్పైలలో 30 శాతం, నలభైల తర్వాత 50 శాతం ఆదాయాన్ని పొదుపు చేయాలని సూచిస్తున్నారు. ఇది క్రమశిక్షణను నేర్పి, పెట్టుబడికి వేదికను సిద్ధం చేస్తుంది.
Updated on: Aug 25, 2025 | 12:36 PM

చాలా మంది డబ్బు సంపాదిస్తుంటారు కానీ.. దాన్ని పొదుపు చేయడంలో విఫలం అవుతుంటారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ MD, CEO అయిన రాధిక గుప్తా తన కొత్త పుస్తకం 'మ్యాంగో మిలియనీర్'లో పొదుపు కోసం ఒక అద్భుతమైన ఫార్ములాను పరిచయం చేశారు. ఆమె పొదుపును క్రికెట్ నెట్ ప్రాక్టీస్‌తో పోల్చారు. పొదుపు చేసేటప్పుడు మీరు ప్రారంభంలో నిర్మించే క్రమశిక్షణ తరువాత విజయవంతమైన పెట్టుబడికి వేదికను నిర్దేశిస్తుందని అన్నారు. ఏ క్రికెటర్ కూడా నెట్ ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్‌లోకి అడుగుపెట్టడడు. ముందుగా పొదుపు కళను నేర్చుకోవకుండా ఏ పెట్టుబడిదారుడూ విజయం సాధించాలని ఆశించలేడు. పొదుపు క్రమశిక్షణకు శిక్షణ ఇస్తుంది, పెట్టుబడి పెట్టడం అనేది గోల్స్ సాధించే, సంపదను నిర్మించే నిజమైన ఆటగా మారుతుంది అని గుప్తా వివరించారు.

10-30-50 ఫార్ములా.. గుప్తా పుస్తకం 10-30-50 నియమాన్ని పరిచయం చేసింది. ఇది జీవితాంతం సంపదను నిర్మించుకోవడానికి దశలవారీ పనిచేస్తోంది. ఈ వ్యవస్థ మీ ఇరవైలలో 10 శాతం ఆదాయం, మీ ముప్పై, నలభైలలో 30 శాతం, నలభై ఏళ్ల తర్వాత 50 శాతం ఆదా చేయాలని సిఫార్సు చేస్తుంది.

మొదటి దశ (20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో.. ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య, మీరు మీ ఆదాయంలో కనీసం 10 శాతాన్ని దాచిపెట్టాలని గుప్తా సలహా ఇస్తున్నారు. ఈ వయసులో చాలా మంది జీతం ప్యాకేజీలు లేదా సంపాదన తులనాత్మకంగా తక్కువగా ఉంటుంది. అందుకే తమ జీతం నుంచి కేవలం 10 శాతం పొదుపు చేస్తే చాలాని అంటున్నారు. అలా మొదలుపెట్టి.. దాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

రెండో దశ (30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యలో.. మీ ముప్పైలు–నలభైల మధ్య, మీ సంపాద బాగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయంలో కనీసం 30 శాతం ఆదా చేయడం ప్రారంభించాలని గుప్తా చెప్పారు. ప్రమోషన్లు, కెరీర్ వృద్ధి, వ్యాపార విస్తరణను పొదుపును పెంచే అవకాశాలుగా పేర్కొన్నారు.

మూడో దశ (40+).. మీకు 40 ఏళ్లు దాటిన తర్వాత మీరు మీ గరిష్ట సామర్థ్యంతో సంపాదిస్తారు. ఈ దశలో మీ ఆదాయంలో కనీసం 50 శాతం ఆదా చేయడానికి ప్రయత్నించాలని అని గుప్తా జతచేస్తూ పిల్లల విద్య, పదవీ విరమణ ప్రణాళిక వంటి ఖర్చులను గమనిస్తున్నారు.




