- Telugu News Photo Gallery Business photos Mahindra Bolero Maxx Pik Up Price in 2023.. Price and Sepecifications
Mahindra Bolero Maxx Pik-Up: మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం.. అదిరిపోయే ఫీచర్స్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దేశీయ మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాన్ని విడుదల చేసింది. ఐమ్యాక్స్ కనెక్టెడ్ సొల్యూషన్ వంటి సదుపాయాలను కొత్తగా చేర్చినట్లు కంపెనీ వెల్లడించింది..
Updated on: Apr 29, 2023 | 4:47 PM

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దేశీయ మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాన్ని విడుదల చేసింది. ఐమ్యాక్స్ కనెక్టెడ్ సొల్యూషన్ వంటి సదుపాయాలను కొత్తగా చేర్చినట్లు కంపెనీ వెల్లడించింది.

హెచ్‌డీ సిరీస్, సిటీ సిరీస్‌లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలోఉంది. ఇందులో 50 నూతన ఫీచర్స్‌ను తెచ్చారు.

పేలోడ్ సామర్థ్యం 1.3 టన్నుల నుంచి 2 టన్నులు ఉంటుంది. ఈ శ్రేణి పికప్ వాహనాల విభాగంలో కొత్త బొలెరో మ్యాక్స్ సరికొత్త ప్రమాణాలను సృష్టించనుందని తెలిపింది.

అయితే రూ.24,999 డౌన్ పేమెంట్ చేసి కొత్త బొలెరో మ్యాక్స్‌ను బుక్ చేసుకోవచ్చని, ఇప్పటి వరకూ మహీంద్రా 20 లక్షల బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాలను విక్రయించింది.

ఇందులో మొబైల్ యాప్ ద్వారా వాహనం ఎక్కడ ఉన్నదో, రూట్ ప్లానింగ్, ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్, జీయో-ఫెన్సింగ్, వాహన మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఈ యాప్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పనిచేయనున్నది. దీని మైలేజీ 17.2 కిలోమీటర్లు.





























