Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన నిమిషానికి 2.35 లక్షలు.. రోజుకు ఎంతో తెలిస్తే బిత్తరపోతారు!
Mukesh Ambani: ముఖేష్ అంబానీ.. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరేమో. ప్రపంచ ధనవంతుల జాబితాల్లో ఉన్నారు. ఈ వ్యాపారం ప్రపంచ స్థాయిలో విస్తరించి ఉంది. ముఖేష్ అంబానీ రోజు వారి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తర పోవాల్సిందే. ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడు..
Updated on: Aug 26, 2025 | 8:30 PM

Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా? నిమిషానికి సెకనుకు ఎంత సంపాదిస్తారు? సమాధానం చదివితే మీరు షాక్ అవుతారు.

ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. చమురు నుండి క్రీడల వరకు ప్రతిదానిలోనూ ఆయన చురుగ్గా ఉంటారు. ఆయన ప్రతిరోజూ కోట్ల రూపాయలు సంపాదిస్తారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ ఏప్రిల్ 2025 నాటికి దాదాపు $96.7 బిలియన్లు (రూ. 8 లక్షల కోట్లు). దీంతో ఆయన ప్రపంచంలోని 18వ ధనవంతుడు.

ముఖేష్ అంబానీ రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఆయన ప్రతి గంటకు దాదాపు 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట. ఒక్కో నిమిషానికి దాదాపు 2.35 లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు.

ముఖేష్ అంబానీ ఆంటిలియా అనే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 15000 కోట్లు. ఈ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇందులో గుడి, స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, థియేటర్ వంటి వస్తువులు కూడా ఉన్నాయి.




