Senior Citizen FD: వృద్ధులకు బెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. ఐదేళ్లలో ఎంత రాబడి వస్తుందో తెలుసా?
ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీలు) సురక్షితమైన పెట్టుబడి పథకాలు. స్థిరమైన వడ్డీ రేటుతో కచ్చితమైన రాబడిని అందిస్తాయి. రిస్క్ కోరుకోని వారు దీనిలో పెట్టుబడులు అధికంగా పెడతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు. వీరు గ్యారంటీ ఆదాయాన్ని కోరుకుంటారు. అందుకే వారు తమ డబ్బును మార్కెట్-లింక్డ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. అందకే వీరికి ఫిక్స్ డ్ డిపాజిట్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. పైగా సీనియర్ సిటీజెన్స్ కు ఈ ఎఫ్డీలలో అదనపు వడ్డీ రేటు వస్తుంది. దీంతో వారు ఈ ఎఫ్డీలలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బ్యాంకులు కూడా సీనియర్ సిటిజెన్స్ ను ఆకర్షించేందుకు మంచి పథకాలను తీసుకొస్తున్నారు. అలాంటి వాటల్లో దేశంలోని ప్రముఖ రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఒకటి. ఇది వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..