Top CNG Cars under 7L: చీప్ అండ్ బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే.. ఫీచర్లు, మైలేజీల్లో మాత్రం టాప్ క్లాస్..

మన దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సాధారణంగా వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో వారికి కనిపిస్తున్న బెస్ట్‌ ఆప్షన్స్‌ విద్యుత్‌ శ్రేణి, సీఎన్‌జీ వాహనాలు. అయితే విద్యుత్‌ శ్రేణి వాహనాలు ధర అధికంగా ఉండటం, చార్జింగ్‌ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో సీఎన్‌జీ వైపు అధికశాతం మంది కారు కొనుగోలు దారులు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న వాహన శ్రేణిలో మారుతి సుజుకి కార్లు ముందు వరుసలో ఉన్నాయి. పర్యావరణ హిత ఆటో మార్కెట్‌ అవసరాలను సుజుకీ తీరుస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రూ. 7 లక్షల లోపు ధరలో బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చే సీఎన్‌ జీ వేరియంట్‌ కార్లను ఇప్పుడు చూద్దాం..

Madhu

|

Updated on: Apr 06, 2023 | 3:07 PM

మారుతీ సుజుకి సెలెరియో ఎస్‌-సీఎన్‌జీ(Maruti Suzuki Celerio Cng).. ఈ కారు మారుతి సుజుకి సీఎన్‌జీ లైనప్‌లో అత్యధిక మైలేజి ఇస్తుంది. ఒక కేజీ సీఎన్‌జీ గ్యాస్‌కి 35.60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.73 లక్షలు. దీనిలో 55.92 బీహెచ్‌పీ పవర్‌, 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0ఎల్‌ కే సిరీస్‌ ఇంజిన్‌ ఉంటుంది.

1 / 5
మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ ఎస్‌-సీఎన్‌జీ(Maruti Suzuki Wagonr Cng).. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఇది. దీనిలో 55.92 బీహెచ్‌పీ పవర్‌, 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0ఎల్‌ కే సిరీస్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది కేజీ సీఎన్‌జీ ఇంధనానికి 35.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.43 లక్షలు.

2 / 5
మారుతీ సుజుకి ఆల్టో కే-10 ఎస్‌-సీఎన్‌జీ(Maruti Suzuki Alto K 10 Cng).. మారుతి సుజుకి తన ప్రసిద్ధ ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ఆల్టో కే10 సీఎన్‌జీ వెర్షన్‌ను గత సంవత్సరం మన దేశంలో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.96 లక్షలు. మైలేజీ కిలో సీఎన్‌జీ ఇంధనానికి 33.85 కిలోమీటర్లు వస్తుంది. దీనిలోని ఇంజిన్‌ 55.92 బీహెచ్‌పీ 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

3 / 5
మారుతీ సుజుకి ఎస్‌ప్రెస్సో ఎస్‌-సీఎన్‌జీ(Maruti Suzuki S Presso Cng).. దేశంలో చవకైన కార్లలోఇది ఒకటి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.90 లక్షలు. కేజీ సీఎన్‌జీ ఇంధనపై 32.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనిలో 55.92 బీహెచ్‌పీ పవర్‌, 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0ఎల్‌ కే సిరీస్‌ ఇంజిన్‌ ఉంటుంది.

4 / 5
మారుతీ సుజుకి ఆల్టో 800 ఎస్‌-సీఎన్‌జీ(Maruti Suzuki Alto 800 Cng).. అత్యంత చవకైన సీఎన్‌సీ కారు ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.13 లక్షలు. ఒక కేజీ సీఎన్‌జీ ఇంధనంతో 31.59 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. ఈ కారులోని 800సీసీ పెట్రోల్ ఇంజన్‌ 40.3 బీహెచ్‌పీ పవర్‌, 60ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

5 / 5
Follow us