- Telugu News Photo Gallery Business photos Chicken prices fall by 15 percent across telugu state Latest Chicken price
Chicken Price: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రేట్లు.. తాజాగా ధర ఎంత ఉందంటే..?
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు తినాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు పెరగడం, మరోవైపు కోళ్లకు వేసే దాణ రేట్లు పెరగడంతో చికెన్ ధరలు పెరిగాయి.
Updated on: Jul 08, 2023 | 5:51 PM

Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు తినాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు పెరగడం, మరోవైపు కోళ్లకు వేసే దాణ రేట్లు పెరగడంతో చికెన్ ధరలు పెరిగాయి. భారీగా నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా ఫారంలోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో ఉత్పత్తి తగ్గి.. డిమాండ్ పెరగడంతో కిలో చికెన్ రూ.330 నుంచి రూ.350 వరకు చేరింది.

అయితే, ఉష్ణోగ్రతలు తగ్గడం, వర్షాకాలం ప్రారంభం కావడంతో పెరిగిన చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఫామ్‌గేట్ చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోవడాన్ని చికెన్ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో గత ఐదు రోజుల్లో చికెన్ ధర 15% వరకు పడిపోయిందని వ్యాపారులు వెల్లడించారు.

మే 2023లో చికెన్ ధరలు ఆల్ టైమ్ హై మార్క్‌కి చేరుకున్నాయి. కిలో ధర రూ.350పైగా పలికింది. దాదాపు రెండు నెలల పాటు ధరలు స్తబ్దుగా కొనసాగాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా అధికంగా కోళ్ల మరణాలు సరఫరాపై ప్రభావం చూపాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది.

జూన్ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో.. కోళ్ల ఉత్పత్తి పెరిగింది. దీంతో మార్కెట్‌లో కోళ్ల లభ్యత పెరిగి.. క్రమంగా తగ్గుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు ఉంది. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది.

అయితే, నెలాఖరు నాటికి చికెన్ కిలో చికెన్ ధర 190కి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కోళ్ల ఉత్పత్తి పెరుగుతుందని దీనిద్వారా చికెన్ ధరలు మరింత తగ్గుతాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు.




