- Telugu News Photo Gallery Business photos Business Ideas: Mushrooms Farming Will Brings You Monthly Rs 50 Thousand, Know The Details
Business Ideas: అద్దిరిపోయే బిజినెస్.. ఉన్న ఊరిలోనే నెల రూ. 50 వేలు సంపాదించవచ్చు.. అదేంటంటే
డైలీ.. 9 టూ 5 చేసి చేసి విసిగిపోయారా.? తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా.. దీన్ని ఫాలో అయ్యారంటే.. ప్రతీ నెలా రూ. 50 వేలు మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెల్సా..
Updated on: Feb 13, 2025 | 8:44 PM

చాలీచాలని జీతంతో ప్రతీరోజూ జాబ్‌కి వెళ్లేవారు.. వ్యాపారం చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇంకొందరికైతే వ్యాపారం చేయాలన్ని కల. కొందరికి డబ్బు ఉంటే.. మరికొందరికి స్థలం ఉంటుంది.. మరి అలాంటప్పుడు మీకోసం ఓ అద్దిరిపోయే బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం.

పుట్టగొడుగుల పెంపకం.. దీనికి మీకు ఎక్కువ భూమి అవసరం లేదు. అటు పెట్టుబడి కూడా పెట్టాల్సిన పన్లేదు. తక్కువ ఖర్చుతో మీ ఇంటిలోనే ఇది ప్రారంభించవచ్చు.

మీ ఇంటిలో పుట్టగొడుగులు పెంచాలని అనుకున్నప్పుడు.. అవి పెరిగే ప్రాంతాన్ని సంక్రమణ నుంచి శుభ్రంగా ఉంచండి. పరిశుభ్రతను పాటించండి. ఇక పుట్టగొడుగుల పెంపకానికి.. ఉడకబెట్టడానికి కొంచెం గడ్డి.. ఆపై 5 కేజీల ప్లాస్టిక్ బ్యాగులు.. ఆ బ్యాగులను ప్రత్యేక గదిలో తాడుతో వేలాడదీయాలి.

ఆ గదిని వెంటిలేషన్ లేకుండా 22 రోజులు చీకటిలోనే ఉంచాలి. గది ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీలు ఉండాలి. 22 రోజుల తర్వాత బ్యాగులను మరో గదికి తరలించాలి. అన్ని బ్యాగులను వేలాడదీయాలి. ఇలా మీరు పుట్టగొడుగుల సాగు చేయవచ్చు.

ఒక్కో బస్తాకు కనీసం 2 కిలోల పుట్టగొడుగులు వస్తాయి. దాదాపుగా 40 బస్తాల్లో పుట్టగొడుగుల పెంపకం చేస్తే.. సుమారు 5 నుంచి 6 కిలోల దిగుబడి వస్తుంది. ఇక పుట్టగొడుగులు బయట మార్కెట్‌లో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు కొనుగోలు జరుగుతోంది. రోజుకు 10 కిలోలు అమ్మితే.. రూ. 3 వేలు.. అదే నెలకు రూ. 90 వేలు వస్తాయి. ఇక అన్ని ఖర్చులు పోనూ రూ. 70 వేల వరకు మిగులుతుంది.




