- Telugu News Photo Gallery Business photos Before buying E vehicles should know these points Telugu Business News
EV Vehicle: ఎలక్ట్రిక్ వాహనాలు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందుగా ఇవి చూసుకోండి.
Updated on: Sep 28, 2023 | 9:52 PM

ఎలక్ట్రిక్ వాహనాలుక కొనుగోలు చేసే ముందు కొన్ని రకాల విషయాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో బడా ఆటో మొబైల్ కంపెనీలు సైతం ఈ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టిన తరుణంలో అసలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే ముందు మొదటగా ఆలోచించే అంశం బ్యాటరీ రేంజ్. మీరు రోజూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. మీ ప్రయాణికి రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది.? ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు ఇబ్బందిగా ఉంటుండొచచు.

ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన మరో అంశం.. మీకు దగ్గర్లో ఈవీ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ప్రస్తుతం పట్టణాల్లో ఈవీ స్టేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే గ్రామాల్లో మాత్రం ఇంకా వీటి ఏర్పాట్లు ఉండడం లేదు. కాబట్టి దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఉత్తమం.

ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు బ్యాటరీ పనితీరును సైతం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ పాడైతే మార్చుకోవడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. బ్యాటరీ మార్చాలంటే టూవీలర్‌కు కనీసం రూ. 50 వేలు, ఫోర్ వీలర్‌కు అయితే రూ. 4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈవీ వెహికిల్స్ ఛార్జింగ్ పూర్తి కావడానికి ఎక్కువ సమమయే పడుతుంది. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంఉటంది. అప్పటి వరకు అర్జెంట్‌గా పనులకు వెళ్లే వారికి ఈ వాహనాలకు పెద్దగా ఉపయోగపడొచ్చు. ఇక రీసేల్ విషయంలో కూడా పెద్దగా ఆలోచించకూడదు. ఎందుకు ఈ వెహికిల్స్ మళ్లీ అమ్మితే ధర రాదు.





























