- Telugu News Photo Gallery Business photos Are banks open or closed today, on August 25? check city wise list
Bank Holidays: మీకు తెలుసా.. సోమవారం బ్యాంకులు బంద్.! ఎందుకంటే.?
మీకు ఇది తెలుసా.? దేశంలోని పలు బ్యాంకుల బ్రాంచీలకు సోమవారం సెలవు. ఎందుకని అనుకుంటున్నారా.? సాధారణంగా బ్యాంకులకు సెలవులు ఆర్బీఐ, నెగోషిబుల్ ఇన్‌స్ట్రూమెంట్ యాక్ట్ కింద వస్తాయి. అలాగే ఈ వారం ఎక్కువగానే సెలవులు రానున్నాయి. మరి ఇవాళ బ్యాంకు పనులు ఉన్నట్లయితే..? ఓ సారి ఈ వార్త చదివేయండి.
Updated on: Aug 25, 2025 | 8:55 AM

స్థానిక పండుగులు, ప్రత్యేక దినాల ఆధారంగా బ్యాంకులకు సెలవుల రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకులకు సంబంధించిన బ్రాంచీలకు కూడా ఇదే వర్తిస్తుంది. మరి కస్టమర్లు ముందుగానే ఈ సెలవులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆగష్టు 25న సోమవారం గౌహతిలోని అన్ని బ్యాంకులు బంద్ కానున్నాయ్. శ్రీమంత శంకరదేవ తిరుభవ్ తిథి సందర్భంగా ఆ నగరంలోని అన్ని బ్యాంకుల బ్రాంచులు బంద్ ఉంటాయి. అదే విధంగా ఆగష్టు 27న బుధవారం వినాయక చవితి సందర్భంగా అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, తెలంగాణ, చెన్నై, విజయవాడ వంటి నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.

ఆగష్టు 28న గురువారం గణేష్ చతుర్ది సందర్భంగా భువనేశ్వర్, పనాజీలో బ్యాంకులు బంద్. ఇక ఆగష్టు 31న ఆదివారం రోజున అన్ని బ్యాంకులకు సెలవు.

అలాగే దేశంలోని అన్ని బ్యాంకులకు ప్రతి రెండో, నాలుగో శనివారం బంద్ ఉంటుంది. అటు ప్రతి ఆదివారం బ్యాంకులకు బంద్ ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో ఏటీఎం, యూపీఐ సేవలు కస్టమర్లకు యధావిధిగా పని చేస్తాయి.

డబ్బులు విత్ డ్రా చేయలన్నా, డిపాజిట్ చేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అలాగే చెక్ క్లియరన్స్ లాంటివి కూడా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు. అందుకే కస్టమర్లు ఈ సెలవుల విషయాన్ని ముందుగానే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.




