Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎన్నో ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్
Subhash Goud | Edited By: Anil kumar poka
Updated on: Jul 27, 2021 | 10:31 AM
Amazon Prime Day Sale: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను కల్పించేందుకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ అందుబాటులో ఉంది. 26,27 తేదీల్లో ఉండే ..
Jul 27, 2021 | 10:31 AM
Amazon Prime Day Sale: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను కల్పించేందుకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ అందుబాటులో ఉంది. 26,27 తేదీల్లో ఉండే ఈ సేల్‌లో వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను కల్పిస్తోంది. కరోనా కారణంగా కొన్ని వారాలపాటు వాయిదాపడిన సేల్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. రెండు రోజులపాటు కొనసాగున్న ఈ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, అమెజాన్ డివైజెస్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
1 / 4
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా రూ. 54,900 విలువైన యాపిల్ ఐఫోన్ 11ను రూ. 47,999కే లభించనుంది. బండిల్డ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భాగంగా మరో రూ. 13,400 తగ్గింపు లభిస్తుంది. క్రెడిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, రూ. 79,900 విలువైన ఐఫోన్ 12ను ప్రస్తుతం 67,999కే విక్రయిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌తో కనుక దీనిని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే అదనంగా మరో రూ.13,400 తక్షణ రాయితీ లభిస్తుంది.
2 / 4
వన్‌ప్లస్ 9 5జీపై అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో రూ. 4 వేల డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 13,400 తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 9 5జీని ఇప్పుడు రూ. 45,999కే సొంతం చేసుకోవచ్చు.
3 / 4
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జి20, ఫైర్ టీవీ స్టిక్, కిండల్ ఈ బుక్ రీడర్స్, ఎకో డాట్, విప్రో 9వాట్స్ స్మార్ట్ బల్బ్, యాపిల్ వాచ్ ఎస్ఈ, సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, సోనీ బ్రేవియా 55 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ, హెచ్‌పీ పెవిలియన్ 15 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి వాటిపై భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. నేటితో ముగియనున్న ఈ ఫ్రైమ్ డే సేల్‌లో ఎన్నో వస్తువులు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.