- Telugu News Photo Gallery Best way to drink apple cider vinegar to get 5 benefits including loss of weight
గుట్టగా మారిన పొట్టకు ఛూమంత్రం.. సరిగ్గా ఆ సమయంలో తాగారంటే వెన్నలా కరగాల్సిందే..
యాపిల్ సైడర్ వెనిగర్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని నీటిలో కలిపి ప్రతిరోజూ తాగితే, బరువు తగ్గడంతోపాటు అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Updated on: Mar 21, 2024 | 1:33 PM

యాపిల్ సైడర్ వెనిగర్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని నీటిలో కలిపి ప్రతిరోజూ తాగితే, బరువు తగ్గడంతోపాటు అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొంచెం గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు, ఎప్పుడు తాగితే మంచిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: యాపిల్ వెనిగర్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది: రీసెర్చ్‌గేట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ గ్లైసెమిక్ ఎఫెక్ట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు దీనికి కారణం..

జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం: యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సమస్యల నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది.

Apple cider Vinegar

బరువు తగ్గడంలో కూడా మేలు చేస్తుంది: యాపిల్ వెనిగర్ ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా పరిగణిస్తారు. హార్వర్డ్ హెల్త్ ప్రకారం, 2009లో 175 మందిపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, 3 వారాల పాటు 1-2 టీస్పూన్ల వెనిగర్‌ను తీసుకునే వ్యక్తులు 2-4 పౌండ్ల బరువును తగ్గారని కనుగొన్నారు.

ఈ సమయంలో తీసుకోవడం వల్ల వేలు జరుగుతుంది.. 1-2 టీస్పూన్ల యాపిల్ వెనిగర్‌ను నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం చాలా ప్రయోజనకరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. (ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులైనా ఉంటే ఈ చిట్కాకలను పాటించే ముందు వైద్యులను సంప్రదించండి..)




