- Telugu News Photo Gallery Best Health Benefits of Nutmeg using daily, check here is details in Telugu
Nutmeg Benefits: జాజికాయతో బోలెడు ఔషధ గుణాలు.. కరెక్ట్ గా వాడితే అద్భుతాలే!
మనం ప్రతి రోజూ ఉపయోగించే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను ఎక్కువగా మసాలా వంటలు, బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ మసాలాలతో వచ్చే టేస్టే వేరు. ఈ జాజికాయతో కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం జాజికాయను ఉపయోగించి.. వివిధ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 09, 2023 | 10:22 PM

మనం ప్రతి రోజూ ఉపయోగించే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను ఎక్కువగా మసాలా వంటలు, బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ మసాలాలతో వచ్చే టేస్టే వేరు. ఈ జాజికాయతో కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం జాజికాయను ఉపయోగించి.. వివిధ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారు.. జాజికాయను ఖచ్చితంగా తీసుకోవాలి. జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్లు నొప్పులు వంటి సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.

శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం వల్ల హార్ట్ ప్రాబ్లమస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇలా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే.. ప్రతి రోజూ తమ ఆహారాల్లో జాజికాయ పొడిని తీసుకోవాలి. గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడిని కలిపి తీసుకుంటే.. కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి సులభంగా కంట్రోల్ అవుతాయి.

జాజికాయ పొడిని ఆహారంతో పాటు తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి దూరమవుతాయి. డిప్రెషన్, ఒత్తిడితో ఇబ్బంది పడేవారు జాజికాయ పొడిని తీసుకుంటే.. ఈ సమస్య ఈజీగా దూరమవుతుంది. పనుల్లో ఒత్తిడికి గురయ్యే వారు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి.

అలాగే జాజికాయలో ఉండే గుణాల కారణంగా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ పొడి తీసుకుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.





























