Subhash Goud |
Updated on: Oct 10, 2022 | 9:54 AM
పండుగ సీజన్ రకరకాల వంటకాలు ఉంటాయి. దీంతో ఎక్కువ పదార్థాలు తినడం వల్ల పెరువు పెరిగిపోతామనే భయం పట్టుకుంటుంది. పండగ సీజన్‌లో ఇష్టం లేకుండా కూడా అతిగా తింటుంటాము. పండుగ సీజన్‌లో అతి పెద్ద భయం బరువు పెరుగుట. అటువంటి పరిస్థితిలో మీరు కొన్నింటిని ఆహారంలో చేర్చుకోవాలి. తద్వారా మీ బరువు నియంత్రణలో ఉంటుంది. దీని కోసం మీరు కూరగాయల రసం తాగవచ్చు. పండుగ సీజన్‌లో మీ బరువును అదుపులో ఉంచుకోవాలంటే వెజిటబుల్ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్: పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయలను ఉపయోగించి మీరు ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. దీని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.
నిమ్మకాయ అల్లం రసం: నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అల్లం జీవక్రియను పెంచుతుంది. తరచుగా ఆకలి సమస్యను నియంత్రిస్తుంది. ఈ రెండింటి రసం చాలా మేలు చేస్తుంది.
దోసకాయ, కివి రసం: దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్ కూరగాయ తీసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి. అదనంగా కివీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని రసం బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్‌లో చాలా తక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనితో పాటు ఇది అనేక ముఖ్యమైన పోషకాల అద్భుతమైన మూలం. బీట్‌రూట్‌లో ఫైబర్ తగినంత మొత్తంలో ఉందని, ఇది బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.