- Telugu News Photo Gallery As Teenage boy dies after eating raw instant noodles, check their side effects on health
Lifestyle: మీకు పచ్చి నూడిల్స్ తినే అలవాటు ఉందా?.. తస్మాత్ జాగ్రత.. ఇది తెలిస్తే వాటి జోలికే వెళ్లరు!
మనకు ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా చేసుకోవడానికి వీలైన స్నాక్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది మ్యాగీ మాత్రమే.. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే చిరుతింటి. అయితే దీన్ని మంచిగా ఉడికించుకొని తినడం మంచిదే.. కాకపోతే కొందరికి ఈ నూడిల్స్‌ను పచ్చిగా తినడం అలవాటు ఉంటుంది. ఈ అలావాటే కొన్ని సార్లు వారికి ప్రాణాంతకంగా మారవచ్చు. ఎందుకంటే పచ్చి నూడిల్స్ తినడం మన ఆరోగ్యానికి ఎంత హానికలిగిస్తుందో ఇటీవల జరిగిన ఒక సంఘటనే చెప్తోంది. ఇంతకు ఆ సంఘటన ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
Updated on: Sep 01, 2025 | 4:37 PM

ఈజిప్టులో ఒక 13 ఏళ్ల బాలుడుకి ఇలానే పచ్చి నూడిల్స్ తినే అలవాటు ఉంది. దీంతో అతను ఏకంగా మూడు ప్యాకెట్ల పచ్చి నూడిల్స్ తిన్నాడు. కానీ కొద్ది సేపటికే ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. పచ్చి నూడుల్స్ తిన్న కొద్దిసేపటికే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడం ప్రారంభమైంది. ఆ వెంటనే వాంతులు చేసుకోవడం స్టార్ట్ అయ్యింది.

బాలుడు వాంతులు చేసుకోవడం చూసిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ అబ్బాయి మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కాబట్టి మీకు కూడా పచ్చి నూడుల్స్ తినే అలవాటు ఉంటే వెంటనే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీ ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదకరం కావచ్చు.

మీరు పచ్చి నూడుల్స్ ఎక్కువగా తింటే, అది మీ జీర్ణవ్యవస్థలో సమస్యలకు దారి తీస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. WHO ప్రకారం, మీరు ఒక రోజులో 2000mg వరకు మాత్రమే సోడియం తినవచ్చు.

ఒక ప్యాకెట్ ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో `1829 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి కంటే ఎక్కువగా నూడిల్స్ ప్యాకెట్స్ తిన్నా, లేదా పచ్చి నూడిల్స్ తిన్నా మీ శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు వచ్చే ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇది గుండెపై కూడా ప్రభావం చూపుతుంది.

పచ్చి నూడుల్స్ తొందరగా జీర్ణం కావడం కష్టం. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పచ్చి నూడుల్స్ శరీరంలోని నీటి పరిమాణాన్ని కూడా తగ్గించి డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. అందుకే వైద్యులు సాధారణంగా తక్షణ నూడుల్స్ తినకూడదని సలహా ఇస్తారు. కాబట్టి ఎక్కువగా నూడిల్స్ తినే అలవాటు ఉంటే వాటిని బాగా ఉడికించుకొని తినండి. లేదంటే మానేయండి.




