- Telugu News Photo Gallery Are you going to the bathroom immediately after eating? Don't take it lightly, check details in Telugu
Health Problems: తిన్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్తున్నారా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు..
ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం కామన్ విషయం. అలాగే బాత్రూమ్‌కి వెళ్లడం కూడా సర్వ సాధారణమైన విషయం. నిజానికి మల విసర్జన సరిగా చేయకపోతే.. అనారోగ్య సమస్యగానే చెప్పొచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మల విసర్జన చేయడం అనేది కామన్ విషయం. కానీ కొంత మంది మాత్రం ఆహారం తిన్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్తూ ఉంటారు. కడుపులో భోజనం పడితేనే తప్ప.. వాష్‌రూమ్‌కి వెళ్లలేరు. ఆహారం తిన్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్లడం అనేది అనారోగ్య..
Updated on: Mar 13, 2024 | 7:20 PM

ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం కామన్ విషయం. అలాగే బాత్రూమ్‌కి వెళ్లడం కూడా సర్వ సాధారణమైన విషయం. నిజానికి మల విసర్జన సరిగా చేయకపోతే.. అనారోగ్య సమస్యగానే చెప్పొచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మల విసర్జన చేయడం అనేది కామన్ విషయం. కానీ కొంత మంది మాత్రం ఆహారం తిన్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్తూ ఉంటారు.

కడుపులో భోజనం పడితేనే తప్ప.. వాష్‌రూమ్‌కి వెళ్లలేరు. ఆహారం తిన్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్లడం అనేది అనారోగ్య సమస్యగానే చెప్పొచ్చు. ఆహారంలోని పోషకాలన్నీ శరీరం గ్రహించిన తర్వాతే.. మిగిలిన వ్యర్థ పదార్థాలు మల విసర్జన రూపంలో బయటకు వెళ్తాయి.

కానీ ఆహారం తీసుకున్న ప్రతీసారీ బాత్రూమ్‌కి వెళ్తే మాత్రం.. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. శరీరంలో విటమిన్ డి సమస్య ఉన్న కారణంగా.. మలానికి సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఐబిఎస్ లక్షణాలతో బాధ పడేవారిలో ఈ సమస్యలు వస్తాయి. ఐబిఎస్ అంటే.. మలం లేదా అతిసారానికి(ప్రకోప ప్రేగు సిండ్రోమ్) సంబంధించినది. ఐబిఎస్ లక్షణాలతో బాధపడేవారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

ఇలా ఆహారం తీసుకున్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్లేవారు.. విటమిన్ డి ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఐబిఎస్ కారణంగా కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.





























